ఆ ముగ్గురు ఎంపీలకు... జగన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చేశారు

Update: 2019-11-21 04:46 GMT
మొన్నటి ఎన్నికల్లో రికార్డ్ విక్టరీ కొట్టేసిన వైసీపీలో నిన్నటిదాకా పరిస్థితి అంతా బాగున్నట్టుగానే కనిపించింది. అయితే ఆ పరిస్థితి క్రమంగా కట్టుతప్పుతున్నట్లుగా సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై అధిష్ఠానం ప్రేక్షకపాత్ర పోషిస్తే... అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం లేకపోలేదు. మరేం చేయాలి? కట్టుతప్పిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. నిజమే.. చర్యలు లేకుంటే భయం ఉండదు కదా. నిన్నటికి నిన్న పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే ఓ వార్నింగ్ పడిపోయింది. తాజాగా ఇప్పుడు ఏకంగా ఒకేసారి ముగ్గురు ఎంపీలకు జగన్ నుంచి కాస్తంత గట్టి హెచ్చరికలే జారీ అయ్యాయట. అయితే ఈ హెచ్చరికలు రఘురామకృష్ణంరాజుకు జారీ అయిన హెచ్చరికల్లాంటివి కాదు. కారణం కూడా అలాంటిది కాదట.

మరి ఈ కొత్త హెచ్చరికలు ఎందుకన్న విషయానికి వస్తే... పార్టీ ఎంపీలుగా పార్టీ స్టాండ్ ను అవగతం చేసుకుని రాష్ట్ర ప్రయోజాలను కాపాడే క్రమంలో ఏమాత్రం అలక్ష్యం చేయరాదు కదా. ఏదో ఎంపీలుగా గెలిచేశాం.. పార్లమెంటుకు వచ్చినా, రాకున్నా చెల్లుతుందిలే... ఒకవేళ పార్లమెంటుకు వచ్చినా ఏదో అలా కూర్చుంటే సరిపోతుందిలే... అంటే కుదరదు కదా. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాల్సిన బాధ్యత పార్టీ ఎంపీలపైనే ఉంటుంది కదా. ఈ మేరకు ఎంపీలంతా మూకుమ్మడిగా, కలిసికట్లుగా కేంద్రం పెద్దలను తరచూ కలవడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడగటం, ఇతర సమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం.. ఇలా జగన్ తన ఎంపీలకు చాలా బాధ్యతలే అప్పగించారు.

యమా యాక్టివ్ గా ఉండాలని జగన్ ఆదేశిస్తే... పార్టీకి చెందిన ఎంపీలు 22 మంది ఉంటే... వారిలో ఓ ముగ్గురు మాత్రం ఏదో అలా వెళ్లాం, ఇలా వచ్చామన్న రీతిలో వ్యవహరిస్తున్నారట. ఇదే విషయం జగన్ చెవిన కూడా పడిందట. ఇంకేముంది... వారికి జగన్ నుంచి కాస్తంత గట్టిగానే వార్నింగ్ లు జారీ అయ్యాయట. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలుగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జగన్ కాస్తంట కటువుగానే హెచ్చరించారట. ఇప్పటికైనా యాక్టివ్ కాకపోతే... క్రమశిక్షణ చర్యలకు కూడా వెనుకాడేది లేదని కూడా స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చేశారట. మరి జగన్ వార్నింగ్ లతోనైనా ఆ ముగ్గురు ఎంపీలు యాక్టివేట్ అవుతారా? లేదంటే క్రమశిక్షణ చర్యలకు గురవుతారో? చూడాలి.
Tags:    

Similar News