కొండపై కేసీఆర్ కు జగన్ మూడు గిఫ్ట్ లు..

Update: 2019-06-09 10:05 GMT
ఏపీ కేబినెట్ కొలువు దీరింది. ఇప్పుడు నామినేటెడ్ సందడి మొదలైంది. ముఖ్యంగా ఏపీలోనే అత్యంత డిమాండ్ అయిన పదవి టీటీడీ చైర్మన్ పదవి. ఆ అఖిలాండ కోట బ్రాహ్మాండ నాయకుడి సేవలో తరించాలని అందరూ కోరుకుంటారు. అందుకే జగన్ ఆ పదవిని తాజాగా తన బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డికి కేటాయించారు.

అయితే టీటీడీ బోర్డులో ఉండే డైరెక్టర్ల స్థానాల్లో ఎవరిని నియమిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఏపీ కోటా ఎలా ఉన్న ఉమ్మడి ఏపీ విడిపోయాక కూడా తెలంగాణ నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా తెలంగాణ నుంచి ముగ్గురు బోర్డు మెంబర్లను తీసుకోవడానికి రెడీ అయ్యారు. అందులో తెలంగాణ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి.. ఇక రెండు టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడానికి జగన్ రెడీ అయ్యారు.

అయితే జగన్ ఇచ్చే ఆ రెండు పదవుల్లో ఒకటి కరణ్ రెడ్డి అనే టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ చార్జికి ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్ లు డిసైడ్ అయినట్లు తెలిసింది. కరణ్ రెడ్డి.. జగన్ కు, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు.. జగన్ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను కరణ్ ఒకప్పుడు నిర్వహించాడు.. ఇప్పుడు కేటీఆర్ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి గా ఉన్నారు. ఇద్దరికీ దగ్గరైన ఈయనను నియమిస్తే జగన్ కూడా ఓకే చెబుతాడని అంటున్నారు..

ఇక రెండో బోర్డు డైరెక్టర్ గా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధిని కానీ లేదంటే ఏదైనా పీఠం అధిపతిని కానీ నియమించాలని స్కెచ్ గీస్తున్నాడట.. పీఠాధిపతులకు తాము ఇచ్చే గౌరవంగా దీన్ని భావించాలని కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. చూడాలి మరి మిగిలిన ఆ ఒక్క సీటు ఎవరికి వస్తుందో..


Tags:    

Similar News