ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే జగన్ తన మాటలతో ఇప్పటికే పాలన మొదలెట్టారు. మౌఖిక ఆదేశాలతో ఆయన పాలనను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ఇప్పటికే కీలక ప్రకటన చేసి వారి మనసుల్ని దోచుకున్నారు. తాజాగా మరో ప్రకటన చేసి.. వారంతా ఫుల్ హ్యాపీ అయ్యేలా చేశారు.
ప్రమాణస్వీకారోత్సవానికి ముందే ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉదయం 10.30 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయాలని.. ఈ విషయంలో కచ్ఛితంగా ఉండమని ఆయన కోరారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత గంటల తరబడి పని చేయాల్సిన అవసరం లేదన్న విషయాన్ని జగన్ స్పష్టం చేశారు.
అంతేకాదు.. సచివాలయంలో పని విధానాన్ని మరింత సరళీకృతం చేయటం.. ఉద్యోగులపై అదనపు భారం ఉండదని ఇప్పటికే జగన్ చెప్పటం తెలిసిందే. అంతేకాదు.. ప్రతి ఫైల్ కి నిర్దిష్ట గడువులోపు క్లియర్ చేసేలా పరిపాలనా సంస్కరణ తీసుకురానున్నట్లుగా జగన్ స్పష్టం చేశారు.
ఫైల్ మీద అనవసరమైన కొర్రీలు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు.. గడువు లోపు క్లియర్ చేసేలా కొత్త విధానాన్ని తెర మీదకు రానున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. రిటైర్ అయ్యే ఉద్యోగుల ప్రయోజనాల్ని దెబ్బ తినే అంశాలకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగుల నుంచి సలహాలు.. సూచనలు స్వీకరించేందుకు సీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా జగన్ చెబుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.