భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్

Update: 2020-02-13 05:45 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోని పలు అంశాలకు సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. తన నిర్ణయాలతో ప్రభుత్వం బాధితుల పక్షాన ప్రభుత్వం ఉంటుందన్న సందేశాన్ని ఇస్తున్నారు. తాజాగా అలాంటి నిర్ణయాన్నే ప్రకటించారు.

ఇంతకాలం భూసేకరణ సమయం లో పండ్లు.. పూల తోటలకు ఇచ్చే నష్ట పరిహారం చాలా తక్కువగా ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పటివరకూ ఉన్న పరిహారాన్ని పూర్తిగా మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు అమల్లో ఉన్న పరిహారానికి దగ్గర దగ్గర మూడు రెట్లు అదనపు పరిహారాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని ఏపీ మంత్రి వర్గం తీసుకుంది.

భూసేకరణకు తోటలు అవసరమైన పక్షం లో వారికిచ్చే పరిహారం చాలా తక్కువగా ఉండేది. ఉదాహరణకు ఒక్కో మామిడి చెట్టుకు ఇప్పటివరకూ కేవలం రూ.2600 మాత్రమే ఇచ్చేవారు. కానీ.. దాని స్థానే తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.7,283 ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా ఒక్కో కొబ్బరి చెట్టుకు రూ.2149 నుంచి రూ.6090 ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఇక నిమ్మ చెట్టుకు ఒక్కోదానికి ఇప్పటి వరకూ రూ.1444 నుంచి రూ.3210కు పరిహారాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News