కాటన్ బ్యారేజీపై పవన్ శ్రమదానానికి జగన్ నో పర్మిషన్

Update: 2021-09-30 08:30 GMT
ఏపీలో జనసేనతో తేల్చుకునేందుకే జగన్ సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల రిపబ్లిక్ వేడుకలో పవన్ రాజేసిన మాటల మంటలకు అటు ఏపీ ప్రభుత్వం కూడా అతే ధీటుగా సమాధానమిచ్చింది. పోసాని, మంత్రులు విరుచుకుపడ్డారు. ఇక పవన్ ఏపీకి వచ్చి విజయవాడ జనసేన కార్యాలయంలో ఎన్ కౌంటర్ చేసేశాడు. వైసీపీ సర్కార్ పై యుద్ధం ప్రకటించారు.

ఇప్పుడు వైసీపీ సర్కార్ కూడా ఇక ఎంతమాత్రం జనసేనను వదిలిపెట్టేది లేదని డిసైడ్ అయ్యింది. ఏపీలోని రోడ్ల సమస్యను ఎలుగెత్తి చాటేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని కాటన్ బ్యారేజీపై జనసేనాని పవన్ కళ్యాణ్ శనివారం శ్రమదానానికి రెడీ అయ్యారు. ఈ మేరకు జనసైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు.కానీ దీనికి పర్మిషన్ నిరాకరిస్తూ తాజాగా ఇరిగేషన్ ఎస్ఈ జనసేన నేతలకు షాకిచ్చారు.

పవన్ శ్రమదానానికి అనుమతి లేదని ఇరిగేషన్ ఎస్ఈ స్పష్టం చేశారు. కాటన్ బ్యారేజీ ఆరోడ్ ఆర్ అండ్ ఆర్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందన్నారు అధికారులు.

ఇక బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని పవన్ చేత జరిపి తీరుతాం అంటూ జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో మేమూ చూస్తామని స్పష్టం చేశారు.

దీంతో కాటన్ బ్యారేజీ సాక్షిగా వైసీపీ వర్సెస్ జనసేన మధ్య వివాదం చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ శ్రమదానానికి జగన్ సర్కార్ నో చెప్పడంతో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది.


Tags:    

Similar News