రెండు రోజులకే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు అర్థమైపోయిందంటున్నారు ఏపీ సీనియర్ అధికారులు. తమ కెరీర్ లో ఈ తరహా ముఖ్యమంత్రిని తాము చూడలేదంటూ కితాబులు ఇస్తున్నారు. ఎందుకంటే.. ఎవరికి వారికి వారికి సంబంధించిన అనుభవాలెన్నో. రెండు రోజులు స్వల్ప వ్యవధే కానీ.. అన్నం ఉడికిందా లేదా అన్నది రెండు మెతుకులు పట్టుకుంటే తెలుస్తుందని.. జగన్ తీరు ఇప్పుడు అలానే ఉందన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.
ఏపీ సచివాలయంలో సీఎం ఛాంబర్ సిద్ధం కాకపోవటంతో తాడేపల్లిలోని తన నివాసం నుంచే జగన్ పని చేస్తున్నారు. నిత్యం అధికారులతో సమీక్షల నుంచి మిగిలిన అన్ని కార్యక్రమాల్ని ఆయన ఇంటి నుంచే పూర్తి చేస్తున్నారు. పంక్చువల్ గా ఉండటం.. ఎవరికి ఏ సమయం ఇస్తే.. ఆ సమయానికి సిద్ధంగా ఉండటం.. వెయిటింగ్ అన్నది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫలానా టైంకి మీటింగ్ అంటే.. షార్ప్ గా ఆ సమయానికి సిద్ధంగా ఉండటం ఏపీ అధికారులకు కొత్తగా మారింది.
ఎందుకంటే చంద్రబాబు హయాంలో చెప్పిన సమయం తర్వాత గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా ఏ సమయానికి ఏం జరగాలో అవి జరుగుతున్నాయి. అధికారులకు తాను చెప్పాల్సిన విషయాల్ని సంక్షిప్తంగా చెప్పేస్తున్న జగన్.. వారు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటున్నట్లుగా చెబుతున్నారు. గతంలో అదే పనిగా గంటల కొద్దీ రివ్యూ మీటింగ్ లు జరిగేవని.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా.. అరగంట.. గంటకు మించి మీటింగ్ లు జరగటం లేదు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. లంచ్ టైం అయిన వెంటనే మీటింగ్ మధ్యలో ఉన్నా.. పూర్తి అయినా వెంటనే తనతో పాటు భోజనానికి ఆహ్వానించి కలిసి లంచ్ చేసే వైనం ఇప్పుడు వారికి సరికొత్త అనుభవాన్ని మిగిల్చేలా చేస్తోంది. తమ కెరీర్ లో ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా తమను భోజనానికి పిలిచింది లేదని చెబుతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే అధికార వర్గాలపై తనదైన ముద్రను వేయటంలో జగన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.