జగన్ మరో సంచలన నిర్ణయం

Update: 2019-12-13 06:33 GMT
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పదవుల పందేరం విషయం లో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేల బలం.. సుస్థిరమైన ప్రభుత్వం ఉన్నా పదవుల విషయంలో అలిగేషన్స్ కు చోటివ్వకుండా సామాజిక న్యాయం చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సీఎంగా జగన్ నూటికి నూరు పాళ్లు నిర్ణయాల విషయంలో కఠినంగా ముందుకెళ్తున్నారు. ప్రజలకు, అణగారిన వర్గాలకు మేలు చేసే విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఫైరవీలు, లాబీయింగ్ లకు తన ప్రభుత్వంలో చోటివ్వడం లేదు. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారు.

మంత్రి పదవుల్లో సీనియర్లను దూరం పెట్టి అణగారిన ఐదు కీలక సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి జగన్ శభాష్ అనిపించుకున్నారు. పార్టీని  నమ్ముకొని ముందునుంచి సేవ చేసిన ఫృథ్వీ, విజయ్ చందర్ లాంటి వాళ్లకే మొదట పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీని నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరగదని ఈ చర్యతో నిరూపించారు.

తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే రెండు ఎమ్మెల్సీ స్థానాలను అణగారినవర్గాలకే ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఒక ఎమ్మెల్సీ పదవిని ఎస్సీ వర్గానికి, మరో పదవిని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.

ఈ రెండు పదవులు కూడా మహిళలకే ఇవ్వడానికి జగన్ నిర్ణయించారు.. దీంతో పదవుల పందేరం విషయంలో జగన్ సామాజిక న్యాయానికే పెద్ద పీట వేయడం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News