ఢిల్లీకి చేరుకున్న జగన్.. రేపు ప్రధానితో భేటి

Update: 2020-10-05 17:35 GMT
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటికి అపాయింట్ మెంట్ కుదిరింది. దీంతో ఆ భేటి కోసం సీఎం జగన్ ఈరోజు సాయంత్రమే బయలుదేరి వెళ్లారు.

తాజాగా సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయం ప్రధానితో భేటి అవుతారు. రాష్ట్రాభివృద్ధి, తాజా రాజకీయ పరిస్థితులపై మోడీతో జగన్ చర్చించనున్నారు. అలాగే రేపు జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటిలో ఢిల్లీ నుంచే సీఎం జగన్ పాల్గొననున్నారు.జగన్ తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, మోపిదేవి, బాలశౌరి ఉన్నారు.

ఇటీవల ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల వ్యవధిలో కేంద్ర హోమంత్రి అమిత్‌ షాను రెండు రోజులు కలిశారు. ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారు కావడంతో ఆయనతో భేటి కానున్నారు.

ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓ నివేదిక సిద్ధం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ప్రధానంగా అమరావతి కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు, ఇతర రాజకీయ పరిణామాలపై జగన్ మోడీ భేటిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీకి ఆర్థికం చేయూతనిచ్చే సాయం కోసం కూడా జగన్ అభ్యర్థన పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఎన్డీఏలో వైసీపీ చేరుతుందనే దానికోసం చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
Tags:    

Similar News