'డబ్బులు తీసుకున్న కుక్కలు'... భజ్జీకి అంత కోపం ఎందుకొచ్చింది?

ఈ సిరీస్ లో భారత్ పెర్ఫార్మెన్స్ పై ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో హర్భజన్ సింగ్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Update: 2025-01-10 05:59 GMT

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోరంగా ఫెయిల్ అవ్వడంపై పలు ఆసక్తికర చర్చలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా... సీనియర్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిరీస్ లో భారత్ పెర్ఫార్మెన్స్ పై ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ లో హర్భజన్ సింగ్ విశ్లేషించాడు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా... టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నంతకాలం అంతా బాగుందని.. గత ఆరు నెలల్లోనే ఏమైంది ఈ జట్టుకు? అని ప్రశ్నించాడు. దీంతో... గంభీర్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ టూర్ లో ఘోరంగా విఫలమైన రోహిత్, కొహ్లీని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లపైనా భజ్జీ స్పందించాడు.

ఈ సందర్భంగా... ప్రతీ ఆటగాడికీ ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయని.. అయితే, ఆట కంటే మరేదీ ముఖ్యం కాదని.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే లాంటి పెద్ద పెద్ద మ్యాచ్ విన్నర్లకే జట్టు నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని.. ఈ విషయాన్ని అప్పట్లోనే బీసీసీఐ, సెలక్టర్లు చెప్పారని హర్భజన్ సింగ్ అన్నాడు.

ఇదే సమయంలో... ప్రధానంగా టీమిండియా సూపర్ స్టార్ సంస్కృతిని వదిలిపెట్టాలని.. పేరున్న ఆటగాళ్లను కాకుండా బాగా ఆడే ఆటగాళ్లను ఎంపిక చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ఈ సందర్భంగా అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ లను ఆసిస్ టూర్ కు ఎంపిక చేసి ఒక్క మ్యాచ్ లోనూ ఆడించని విషయాన్ని ప్రస్థావించాడు.

ఇలా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సరైన ప్రదర్శన చేయలేక విఫలమైన టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై విమర్శలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సమయంలో సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన సూచన చర్చకు దారి తీసిందని అంటున్నారు. ఈ సమయంలో మరోసారి ఘాటుగా స్పందించాడు భజ్జీ.

అవును... టీమిండియా సూపర్ స్టార్ సంస్కృతిని వీడాలని హర్భజన్ సింగ్ చేసిన సూచన చర్చకు దారి తీసిందని అంటున్న వేళ.. ఏమైందో ఏమో కానీ.. మరోసారి ఘాటుగా స్పందించాడు భజ్జీ. ఇందులో భాగంగా.. "మార్కెట్ లో ఏనుగు నడిచివెళ్తుంటే.. డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి" అని రాసుకొచ్చాడు.

దీంతో... ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. భజ్జీ ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశాడు.. ఎవరిని ఉద్దేశించి చేశాడు.. ఏ విషయంలో హర్ట్ అయ్యి చేశాడు అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News