మాట నిలబెట్టుకున్న జగన్

Update: 2022-04-20 05:30 GMT
క్యాబినెట్ నుండి తప్పించిన వారిని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటానని చెప్పిన మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. ఈమధ్యనే పునర్ వ్యవస్ధీకరించిన క్యాబినెట్ లో 14 మందికి జగన్ అవకాశం ఇవ్వని విషయం అందరికీ తెలిసిందే. వారందరినీ పార్టీ యాక్టివిటీస్ కోసమే జగన్ నియమించారు. క్యాబినెట్ నుండి తప్పించిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా ఎం శంకరనారాయణను నియమించారు. గుంటూరు జిల్లాకు మేకతోటి సుచరితను నియమించారు.

ఎన్టీయార్ జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాస్ ను, కృష్ణా జిల్లాకు పేర్నినాని, ఏలూరు జిల్లాకు ఆళ్ళనానిని, పశ్చిమగోదావరి జిల్లాకు చెరుకువాడ శ్రీరంగనాధరాజును, కాకినాడ జిల్లాకు కురసాల కన్నబాబు, విశాఖపట్నం జిల్లాకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), పార్వతీపురం మన్యం జిల్లాకు పాముల పుష్పశ్రీవాణి, శ్రీకాకుళంకు ధర్మాన కృష్ణదాసును అధ్యక్షులిగా నియమించారు.

అలాగే రీజనల్ కో ఆర్డినేటర్ అనే పోస్టులను కూడా నియమించారు. వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు అనీల్ కుమార్ యాదవ్, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నానిని నియమించారు.

పనిలో పనిగా పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మంత్రి బొత్సా సత్యనారాయణను, చిత్తూరు, అనంతపు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు.

ఎంఎల్సీ పదవిని ఇవ్వలేకపోయిన కారణంగా మర్రి రాజశేఖర్ ను జగన్ ఎన్టీయార్, కృష్ణా జిల్లాలకు రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించటం గమనార్హం. మొత్తంమీద చెప్పినట్లే మాజీమంత్రులందరికీ జిల్లా అధ్యక్షలుగానో, రీజనల్ కో ఆర్డినేటర్లుగానో నియమించారు.

ఇక తమ కెపాసిటీని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాజీ మంత్రులపైనే ఉంది. నిజానికి మంత్రులకంటే ఇపుడు జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లపైనే ఎక్కువ బాధ్యతలుంటాయి. జిల్లాల్లో పార్టీని బలోపతం చేయటం, నేతల మధ్య విభేదాలుంటే సర్దుబాటు చేసి మళ్ళీ ఎన్నికలకు అందరినీ రెడీ చేయటమనే పెద్ద బాధ్యత మాజీలపైనే ఎక్కువగా ఉంది. మరి ఏమి చేస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News