అధికారంలోకి రాకముందు ప్రజాసమస్యలపై 3వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ వారి కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ప్రకటించారు. అయితే అక్కడితో ఆయన పని అయిపోలేదు. ఆ పథకాలు అందుతున్నాయా? లేదా అన్నది ఇప్పుడు చెక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఏపీ సీఎం జగన్ జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో పడి ప్రజలకు దూరం అయ్యారన్న ప్రచారం ఉంది. తొలి ఏడాది పాలనపై దృష్టిపెట్టిన జగన్ కు తర్వాత కరోనా వైరస్ తో మరో ఏడాది మొత్తం పర్యటనలకు బ్రేక్ పడిందని చెబుతారు. దీంతో జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. గడిచిన 20 నెలల్లో జగన్ పెద్దగా జిల్లాల్లో పర్యటించింది లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జగన్ రాలేదు.
జగన్ రెండేళ్ల పాలన పూర్తి కావస్తున్న తరుణంలో ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించడంతో ఇక జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక జగన్ జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది. రచ్చబండను ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే రహదారుల అభివృద్ధి కోసం రూ.2వేల కోట్లు ముందస్తుగా కేటాయించారు.
చాలా జిల్లాల్లో జూనియర్ మంత్రులకు, సీనియర్ ఎమ్మెల్యేలకు పడడం లేదన్న ప్రచారం ఉంది.. పంచాయతీ ఎన్నికల సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. నేతలంతా గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి ఉంది. జిల్లాల పర్యటనలతో వాటిని సెట్ రైట్ చేయాలని జగన్ యోచిస్తున్నారట. ఈ పర్యటనల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతుండడంతో ఎమ్మెల్యేలు, మంత్రుల్లో సీఎం జగన్ పర్యటన టెన్షన్ పుట్టిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ జిల్లా పర్యటనలపై ప్రజల కంటే నేతలకే ఎక్కువగా ఆసక్తి ఉంది. అనేక జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రూపు విభేదాలతో ఇబ్బంది పడుతున్నారట.. జిల్లాల పర్యటనకు జగన్ వస్తే పార్టీలోని విభేదాలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. అంతేకాకుండా తమ నియోజకవర్గంలోని దీర్ఘకాలక సమస్యలపై కూడా జగన్ స్పందించే అవకాశముండటంతో జిల్లా నేతలందరూ జగన్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు సమాచారం.