నవ్యాంధ్రలో జగన్ సర్కారు అమలు చేస్తున్న దశలవారీ మద్య నిషేధం... ఎన్నెన్నో ప్రయోజనాలను ఇస్తోంది. తాను అధికారంలోకి వస్తే... మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేసి తీరతానని చెబుతూ వచ్చిన జగన్... తనకు అధికారం దక్కగానే... ఇచ్చిన మాట ప్రకారం మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తూ సాగుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో బెల్టు షాపులను సింగిల్ దెబ్బకే రద్దు చేసేసిన జగన్... మొన్నటికి మొన్న మద్యం షాపులను 20 శాతం మేర తగ్గించేశారు. అంతటితో ఆగకుండా... రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న బార్లను 40 శాతం మేర తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. జనవరి నుంచి బార్లను కుదించేస్తున్నారు. వెరసి తొలి అడుగులోనే తాను అనుకున్నట్లుగానే జగన్ సగం మేర మద్య నిషేధాన్ని అమలు చేసేశారని చెప్పక తప్పదు.
సరే... మద్య నిషేధంపై ఇప్పటికే విపక్షాలతో పాటు పలువురు మేథావులు కూడా పెదవి విరిచిన వైనం గుర్తుంది కదా. మద్య నిషేధంతో సర్కారీ ఆదాయం తగ్గడం, ఫలితంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం, రోజువారీ పాలన కూడా కష్టం అవడం ఖాయమంటూ డేంజర్ బెల్స్ వినిపించారు. అయితే ఈ తరహా మాటలను జగన్ ఏమాత్రం పట్టించుకోకుండానే ముందుకు సాగారు. తాను వేసుకున్న అంచనా ప్రకారం జగన్ మద్య నిషేధం అమలు దిశగానే సాగారు. ఫలితంగా ఇప్పుడు తాను అమలు చేస్తున్న మద్య నిషేధం ఏ మేర ప్రయోజనాలను ఇస్తుందన్న విషయాన్ని విమర్శకులకు జగన్ చాలా స్పష్టంగానే కనిపించేలా చేశారని చెప్పాలి.
అయినా జగన్ అధికారం చేపట్టి ఆరు నెలల అనతి కాలంలోనే మద్య నిషేధంతో ఏమేం ప్రయోజనాలు వచ్చాయన్న వివరాల్లోకి వెళితే... ఆశ్చర్యకర విషయాలను మనకు కనిపిస్తాయి. మద్య నిషేధం ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం నేరాలు చాలా మేరకు తగ్గాయట. మద్యపానం ద్వారా కలిగే తాత్కాలిక ఉత్సాహంతో మద్యం ప్రియులు చాలా నేరాలే చేస్తున్నారు. వీటిలో మహిళలపై లైంగిక దాడులను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే జగన్ మద్య నిషేధంతో రాష్ట్రంలో ఈ తరహా నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయట. అంతేకాకుండా జగన్ లిక్కర్ పాలసీతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్డడంతో పాటు... మద్యం అమ్మకాలపై అధిక సుంకాలు విధించిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆబ్కారీ శాఖ ఆదాయమేమీ తగ్గలేదట. అంటే... జగన్ లిక్కర్ పాలసీతో ఒకే దెబ్బకు రెండు పిట్లలన్న మాట.
ఇదిలా ఉంటే... దశలవారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా తొలి అడుగులోనే దాదాపుగా ఘన విజయం సాధించిన జగన్... సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా వడివడిగానే అడుగులు వేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా మద్యం విక్రయాలను పూర్తిగా తగ్గించడంతో పాటు మద్యం విక్రయాలపై తనదైన శైలి పరిమితులు విధించనున్నారట. ఈ పరిమితులు విధించడంతో పాటు రాష్ట్రంలో ఇకపై మద్యం తాగాలన్నా, వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేయాలన్నా... ప్రత్యేకంగా లిక్కర్ పర్చేజ్ ఐడీలను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారట. ఈ కార్డుల జారీకి ఒక్కో మద్యపాన ప్రియుడికి ఏటా రూ.5 వేలను ఫీజుగా వసూలు చేయనున్నారట. ఏడాది పరిమితితో జారీ చేసే ఈ కార్డులను రెన్యూవల్ చేసుకోవలన్నా కూడా మరోమారు రూ.5 వేలు చెల్లించాల్సిందేనట. అంటే... ఏపీలో మద్యం తాగాలంటే... భారీగా పన్నులతో కూడిన మద్యంతో పాటుగా మద్యం కొనుగోలుకు అర్హత సాధించేలా కార్డులు కూడా తీసుకోవాలన్న మాట.
ఈ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సాగుతున్న జగన్ సర్కారు... లిక్కర్ పర్చేజ్ ఐడెంటిటీ కార్డుల జారీ, వాటి రెన్యూవల్, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రాష్ట్రానికి వస్తే పాటించాల్సిన నిబంధనలు, అక్రమ మద్యాన్ని నిలువరించే దిశగా పలు కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా సాగుతుందట. ఇందులో భాగంగా వివిధ వర్గాల నుంచి అందిన సలహాల మేరకు ఇప్పటిదాకా కొన్ని నిర్ణయాలను జగన్ ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి నిర్ణయాల్లో కొన్ని ఈ కింది విధంగా ఉన్నాయి.
1. ఏడాదికి రూ.5000 ఫీజుతో జారీ చేసే లిక్కర్ పర్చేజ్ కార్డు ఉన్నా... అడిగినంత మద్యం ఇవ్వరు. ఓ నిర్ణీత కోటా మేరకు మాత్రమే మద్యం దొరుకుతుంది. రోజుకు ఇంత పరిమాణం అని నిర్దేశించిన తర్వాతే కార్డులు జారీ చేసి... రోజులో ఆ పరిమితి మించిన వ్యక్తులకు అదనంగా మద్యం ఇవ్వరట. ఒకవేళ అధికారుల కళ్లుగప్పి ఒకే కార్డుపై పరిమితికి మించి మద్యం కొనుగోలు చేస్తే.. సదరు కార్డులు ఆటోమేటిక్ గా రద్దైపోతాయట.
2. లిక్కర్ పర్చేజ్ కార్డుల జారీకి ఒక్కో వ్యక్తి నుంచి రూ.5000 వేలను వసూలు చేస్తారు. ఏడాది వరకు మాత్రమే ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది. గడువు తీరిన తర్వాత కార్డును రెన్యూవల్ చేయించుకోవాలన్నా... రూ.5 వేలు చెల్లించాల్సిందే. అంతేకాకుండా రూ.5 వేలు ఎవరు చెల్లించినా కార్డుల జారీ గుడ్డిగా జరగదట. రూ.5 వేలు చేతిలో పెట్టుకుని తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చిన వారికే కార్డులు జారీ చేస్తారట.
3. ఈ కార్డు తీసుకున్న వ్యక్తి ఏదైనా నేరానికి పాల్పడితే... అతడి కార్డు ఆటోమేటిక్ గా రద్దు అయిపోతుందట. అంతేకాకుండా ఒక్కసారి ఈ కారణంగా కార్డు రద్దు అయితే... ఆ వ్యక్తికి భవిష్యత్తులో అసలు కార్డును ఇవ్వరట.
4. 25 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కార్డులు జారీ చేస్తారట.
5. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులు మద్యం కొనుగోలు చేయాలంటే సరిపడ గుర్తింపు కార్డులు అందజేయాల్సిందేనట. అంతేకాకుండా కార్డులున్న వ్యక్తుల మాదిరే... వీరికి కూడా నిర్ణీత పరిధి మేరకే మద్యం ఇస్తారట.
6. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టుల వద్ద ఎలాంటి మద్యాన్ని అనుమతించరట.