తమ్ముడి మీద జగన్ అమిత ప్రేమ...లోకేష్ కి దొరికేశారుగా

Update: 2022-12-26 11:30 GMT
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని చెబుతారు. అలాగే ఎంతటి ముఖ్యమంత్రి అయినా  జగన్   తన కారులో తమ్ముడు అయిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎక్కించుకుని వెళ్ళలేకపోయారు. దానికి సీఎం సెక్యూరిటీ నో చెప్పేసింది. ఈ సందర్భంగా తన తమ్ముడే కదయ్యా అంటూ జగన్ సెక్యూరిటీతో అనడం అది వీడియోగా వచ్చి వైరల్ అయింది.

దాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ యువ నేత నారా లోకేస్ధ్ జగన్ మీద గట్టిగా విరుచుకుపడ్డారు. తమ్ముడు తమ్ముడే నేరగాడు నేరగాడే జగన్ రెడ్డీ అంటూ ఆయన కామెంట్స్ చేశారు. బాబాయ్ కి అబ్బాయి చేసిన ద్రోహం వెంటాడుతూనే ఉంటుందని కూడా కామెంట్స్ చేశారు.

తప్పులు చేసినా తప్పుడు మనుషులను ప్రోత్సహిస్తున్నా ఇదే దుస్థితి గొడ్డలి పోటు రెడ్డిగారూ అని ట్వీట్ చేశారు. తమ్ముడని చూడరు  నేరగాడిగానే చూస్తారు ఇది భద్రతా సిబ్బంది లెక్క అని ఆయన ట్వీట్ చేశారు. ఇపుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జగన్ మూడు రోజుల తన కడప జిల్లా టూర్ లో భాగంగా ఒక చోట తన కారులో ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని ఎక్కించుకోవాలని చూసినట్లుగా తెలుస్తోంది.

అయితే అది కుదరదు అని భద్రతా సిబ్బంది చెప్పడంతో ఆ విషయం మీద ఎవరో తీసిన వీడియో బయటపడింది. అదిపుడు టీడీపీకి అస్త్రంగా మారింది. ఇదిలా ఉంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఉన్నాయి. దాంతో పాటు విపక్షాలు కూడా వైఎస్ వివేకా హత్య మీద విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

మరో వైపు ఈ కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం  తెలంగాణాలో ఈ కేసు విచారణ జరగనుంది. ఈ నేపధ్యంలో అవినాష్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యత జగన్ ఇవ్వడం మీద కూడా టీడీపీ మండిపడుతోంది. తప్పులు చేసిన వారికి వెనకేసుకుని వస్తున్నారు అంటూ లోకేష్ చేసిన ట్వీట్ కూడా అందులో భాగమే అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి జనవరి మొదటి వారలో కీలకమైన విషయాలు బయటకు వస్తాయని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ మధ్యనే మీడియా సమావేశం పెట్టి మరీ కామెంట్స్ చేశారు. ఇలా ఒక వైపు వివేకానందరెడ్డి హత్య కేసు మీద విపక్షాలు ఏదో జరిగిందని అంటున్న నేపధ్యంలో అవినాష్ కడపలో జగన్ టూర్ లో మొత్తం ఆయన వెంట ఉన్నారు.

అయితే ఆయన్ని తన కారులో ఎక్కించుకుందామని జగన్ ప్రయత్నం చేసినపుడు మాత్రం సెక్యూరిటీ అడ్డగించింది అన్నదే వార్తగా బయటకు వస్తోంది. మరి సెక్యూరిటీ దేనికి ఆయన్ని వద్దు అన్నారో తెలియదు కానీ నేరస్థుడు కాబట్టే నో చెప్పారెని లోకేష్ ట్వీట్ చేస్తున్నారు. చూడాలి మరి దీని మీద వైసీపీ ఎలా రెస్పాండ్ అవుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News