తనకు అత్యంత సన్నిహితులతో పాటు.. పరిచయస్తులతో అందరిని తన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆహ్వానిస్తున్నారు ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను కాబోయే ముఖ్యమంత్రి అన్న భావన లేకుండా తన స్థాయి కంటే తక్కువైన వారిని సైతం.. స్వయంగా ఫోన్ చేసి ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని ఇన్వైట్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి పనే చేశారు జగన్. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య శాఖామంత్రి మల్లాడి కృష్ణారావుకు జగన్ ఫోన్ చేశారు. విజయవాడలో ఈ నెల 30న తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని.. ఆ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
దీంతో.. మల్లాడి ఓకే చెప్పారు. తనకు జగన్ ఫోన్ చేసి.. ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని కోరిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే.. యానాంకు..ఏపీకి మధ్యనున్న సరిహద్దు అంశాన్ని కూడా జగన్ తో చర్చించాల్సిన అవసరం ఉందని.. ముఖ్యమంత్రి పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ ఆరున ఆయన్ను కలుసుకోనున్నట్లు చెబుతున్నారు. తనకు పరిచయస్తులైన వారందరికి ఫోన్ చేసి మరీ జగన్ ఆహ్వానిస్తున్నారు.