జగన్ మార్క్ పాలిటిక్స్ : అయిదుగురు మంత్రులు అవుట్...మండలి నుంచి ఇన్ ...?

Update: 2023-02-18 09:00 GMT
ఏపీ కేబినెట్ నుంచి అయిదురు మంత్రులు గన్ షాట్ గా అవుట్ అయ్యే చాన్స్ ఉంది అని అంటున్నారు. అదే సమయంలో ఈ మంత్రుల ప్లేస్ లో శాసనమండలి నుంచి కొత్తగా ఎమ్మెల్సీలు కాబోతున్న వారిలో అయిదురుగుకి చాన్స్ ఇస్తారని న్యూస్ తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇది కొత్త ఎమ్మెల్సీలకు మనసు నిండా ఆనందం నింపుతూండగా ఎవరు అవుట్ తారు అన్నది మినిస్టర్లకు పట్టుకున్న బెంగగా ఉంది.

సరిగ్గా ఏడాది క్రితం అంటే 2022 ఏప్రిల్ లో జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. నాడు ఆయన పాతిక మందిని తీసుకున్నారు. అందులో పాతవారు సగం ఉన్నారు ఇక పాత కొత్త మంత్రులు అంతా కలిపితే మంత్రివర్గం నిండిపోయినట్లే. ఖాళీలు ఏవీ లేవు.

అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరుని ఎప్పటికపుడు బేరీజు వేస్తూ వస్తున్న జగన్ వారిని తప్పించే యోచనలో ఉన్నారని టాక్. ఆ విధంగా చూసుకుంటే మూడేళ్ల పైగా మంత్రులుగా పనిచేసిన గోదావరి జిల్లాకు చెందిన సమాచార మంత్రి చెల్లుబోయిన గోపాలక్రిష్ణతో   పాటు ఉత్తరాంధ్రాకు చెందిన సీదరి అప్పలరాజుని తప్పిస్తారు అని అంటున్నారు.

అలాగే గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రికి గండం పొంచి ఉందని అంటున్నారు. ఇక జగన్ తోనే తన నడక అంటూ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంటూ వచ్చిన మర్రి రాజశేఖర్ కి ఈ దఫా ఎమ్మెల్సీ సీటు ఖాయమని అంటున్నారు. అదే టైంలో ఆయన్ని మంత్రిగా చేస్తారు అని చెబుతున్నారు. అంటే ఆ లెక్కన ఎవరికి ఈ జిల్లాలో గండం ఉంది అన్నది తేలాల్సి ఉంది. మహిళా మంత్రి విడదల రజనీకు చెక్ చెబుతారా అన్న చర్చ కూడా వస్తోంది.

ఇక కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మర్రి రాజశేఖర్ కి ఆ పదవి ఇచ్చి భర్తీ చేస్తారని అంటున్నారు. అదే విధంగా మరో నలుగురు ఎమ్మెల్సీలకు కూడా  మంత్రుల  చాన్స్ దక్కబోతోందని అంటున్నారు. ఈసారి 23 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఇందులో పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఖాయం. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలలో మాత్రం ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

ఏది ఏమైనా ఇలా కొత్త ఎమ్మెల్సీలు అయిన వారి నుంచి సామాజిక సమీకరణలతో   పాటు గతంలో తాను హామీ ఇచ్చిన మేరకు న్యాయం చేయని వారికి ఈసారి ప్రాధాన్యత ఇస్తూ మంత్రులను చేయాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు క్రిష్ణా జిల్లాలు కీలకంగా మారబోతున్నాయి. దాంతో ఈ జిల్లాల నుంచి కమ్మకు ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యత తప్పనిసరిగా ఉంటుందని, అలాగే సోషల్ ఇంజనీరింగ్ కూడా యధాప్రకారం చేస్తారని అంటున్నారు.

ప్రస్తుతం 18 ఎమ్మెల్సీ పదవుల కోసం గట్టి పోటీ ఉంది. జగన్ ఆచీ తూచీ ఎంపిక చేయనున్నారు అని అంటున్నారు. వీరి నుంచే మంత్రులుగా కొందరిని తీసుకుంటారు కాబట్టి ఈ ఎంపిక చాలా ముఖ్యమని అంటున్నారు. ఇక మంత్రులుగా ఎవరు అవుట్ అన్న దాని మీద వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. రాయలసీమ నుంచి ఒక మహిళా మంత్రికి గండం ఉందని అంటున్నారు. అలాగే కోస్తా జిల్లా నుంచి ఒకరిని తప్పిస్తారు అని తెలుస్తోంది.

దీంతో మంత్రులు అంతా తమ జాతకాలను ఒక వైపు చూసుకుంటూంటే మరో వైపు ఎమ్మెల్సీల రేసులో ఉన్న వారు ముందు ఎమ్మెల్సీ ఆ మీదట మంత్రి పదవి డబులు ప్రమోషన్ అనుకుంటూ జగన్ దయ కోసం చూస్తున్నారు ఏది ఏమైనా జగన్ మార్క్ పాలిటిక్స్ లో ఎవరు నెగ్గుతారు ఎవరికి కిరీటం దక్కుతుంది అన్నది చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News