ఏపీ సర్కారు అడ్డగోలు విధానాలపై అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఏపీ విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్లీనరీ నిర్వహించుకోవటం తెలిసిందే. వచ్చే నెల 8..9 తేదీల్లో ప్లీనరీని నిర్వహించుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్లీనరీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటమే కాదు.. పక్కా ప్లానింగ్ తో గ్రాండ్ సక్సెస్ చేయాలని క్యాడర్ ఊవ్విళ్లూరుతోంది.
ఇక.. పార్టీ నేతలు సైతం ప్లీనరీని బ్రహ్మాండంగా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ప్లీనరీ నిర్వహణకు సంబంధించిన అంశాల్ని ఆయన చర్చించారు. ప్లీనరీని గ్రాండ్ గా నిర్వహించుకోవటానికి అవసరమైన వివిధ కమిటీల నియామకాలపైన చర్చ జరిగింది.
విజయవాడ.. గుంటూరు మధ్యలోని అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న స్థలంలో ప్లీనరీని నిర్వహించనున్నారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించిన పనులు ఎక్కడి వరకూ వచ్చాయన్న విషయాన్ని వైఎస్ జగన్ పార్టీ నేతల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకీ ఏపీ అధికారపక్షం పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి తగ్గట్లుగా ప్రభుత్వంపై పోరటానికి అవరమైన కార్యాచరణను కూడా సిద్ధం చేయాలని పార్టీనేతల్ని జగన్ కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/