ఆసక్తికర వ్యాఖ్యలకు వేదికగా మారింది ఏపీ గవర్నర్ నరసింహన్ వీడ్కోలు కార్యక్రమం. రోటీన్ కు భిన్నంగా.. గవర్నర్ నరసింహన్.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ పూర్తిస్థాయి భావోద్వేగంతో మాట్లాడిన వైనం అందరిని కట్టిపడేసేలా ఉందని చెప్పాలి. తమను వీడి వెళుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్నారన్న సంతోషం కూడా ఉందన్నారు జగన్ మోహన్ రెడ్డి. నరసింహన్ తో తనకు పదేళ్ల పరిచయం ఉందన్నారు.
గవర్నర్ నరసింహన్ నాన్నగారిలా తనకు అనేక సలహాలు ఇచ్చారని.. తాను సీఎం అయ్యాక కూడా ముందుండి నడిపించారన్నారు. మరికొంతకాలం ఆయన గవర్నర్ గా కొనసాగి ఉంటే బాగుండేదన్న భావనను వ్యక్తం చేశారు. పెద్దాయన స్థానంలో నరసింహన్ ను తన మనసులో ఉంచుకుంటానని జగన్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. తాను ఎక్కడ ఉన్నా ఏపీ అభివృద్దిని కాంక్షిస్తానని చెప్పిన ఆయన.. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలన్నారు. ఏపీ ప్రజల్ని వదిలి వెళుతున్నందుకు తనకు బాదగా ఉందన్నారు. ఏపీ ప్రజలతో తనకెంతో అనుబంధం ఉందన్నారు.
1951లో విజయవాడలోనే తన అక్షరాభ్యాసం జరిగిందని.. అప్పట్లో తాము గవర్నర్ పేటలో ఉండేవాళ్లమన్నారు. తనకు అహోబిలం నరసింహస్వామి పేరు పెట్టారన్నారు. సీఎం జగన్ ను తన కుమారుడిగా భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
జగన్ తన 34 రోజుల పాలనలో ప్రతి బాల్ సిక్సర్.. బౌండరీలను తాకుతున్నట్లుందని నరసింహన్ ప్రశంసించారు. పాలనలో జగన్ మరిన్ని సెంచరీలు చేయాలన్నారు. కెప్టెన్ గా జగన్ నాటౌట్ గా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాజ్యాంగ నియమాల మేరకే ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నట్లుగా చెప్పారు.