ఆ మంత్రులు మౌనంగా ఉంటే..ఎవ‌రికి న‌ష్టం..ఏపీలో హాట్ డిస్క‌ష‌న్‌!

Update: 2019-07-22 07:34 GMT
ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నారు. వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తానంటూ ఆయ‌న చేసిన ప్ర‌తిజ్ఞ మేర‌కు ఆయ‌న ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌దైన మార్కు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తొలి అడుగులోనే రాష్ట్ర ప్ర‌జ‌ల‌ - రాజ‌కీయ విమ‌ర్శ‌కుల  మ‌న‌సులు దోచుకున్నారు. త‌న మంత్రి వ‌ర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అదేస‌మ‌యంలో 60 శాతం ప‌దవుల‌ను ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనార్టీ - కాపుల‌కు కేటాయించారు. దీంతో రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. రెడ్డి రాజ్యం వ‌స్తుంద‌ని అనుకున్న కొంద‌రు మేధావుల నోళ్ల‌కు తాళం వేసిన‌ట్ట‌యింది. రాష్ట్ర ప్ర‌భుత్వ మంత్రి వ‌వ‌ర్గంలో జ‌రిగిన సోష‌ల్ ఇంజ‌నీరింగ్ అద్భుత‌మ‌ని ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శంసించారు.

రాష్ట్రంలో త‌న‌ను వ్య‌తిరేకించేవారికి త‌న చేత‌ల‌తోనే స‌మాధానం చెబుతున్న జ‌గ‌న్‌ కు ఇప్పుడు మ‌రో సంక‌టం వ‌చ్చింది. తాను ఎన్నో ఆశ‌లు - ఆశ‌యాల‌తో ఇచ్చిన ప‌దవుల‌ను మంత్రులు అనుభ‌వించేందుకు మాత్ర‌మే వినియోగించుకుం టున్నారనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంలుగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి - నారాయ‌ణ‌స్వామి - అంజాద్ బాషా వంటివారు ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ గ‌ళాన్ని విప్పింది లేదు. ఎస్సీ - మైనార్టీ - ఎస్టీ నాయ‌కుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డ‌మే ఇది తొలిసారి. అందునా ఓ మ‌హిళ‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇచ్చారు. అయినా కూడా వారు స‌మ‌ర్ధంగా వినియోగించుకోలేక పోతున్నార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోప‌క్క‌ - మంత్రివ‌ర్గంలోనూ తానేటి వ‌నిత‌ - శ్రీరంగ‌నాధ‌రాజు - వెలంప‌ల్లి శ్రీనివాస్‌ - ఆళ్ల నాని - ధ‌ర్మాన కృష్ణ‌దాస్ - గౌతం రెడ్డి వంటి వారికి(వారు అస‌లు ఊహించ‌క పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం) మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే, వీరంతా త‌మ త‌మ స‌బ్జెక్టుల‌ను మాట్లాడేందుకు కూడా మీడియా ముందుకు రావ‌డంలేదు. మ‌రోప‌క్క‌ - ప్ర‌తిప‌క్షం నుంచి బ‌ల‌మైన గ‌ళాలు వినిపిస్తున్నా.. జ‌గ‌న్ ఏరికోరి ఎంచుకుని ప‌ద‌వులు ఇచ్చిన వారు మాత్రం మౌనం దాలుస్తున్నారు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు మంత్రులు మిన‌హా చాలా మంది నోరు మెద‌ప‌డం లేద‌న్న టాక్ ఉంది.

ఇది వారికి వ్య‌క్తిగ‌తంగా చేటు తెచ్చే అంశం ఒక‌టైతే.. జ‌గ‌న్ కావాల‌నే వారి నోటికి తాళాలు వేశార‌నే వ్య‌తిరేక ప్ర‌చారం ఊపందుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. వారికి ప‌ద‌వులు ఏదో అలంకార ప్రాయంగా - ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేందుకు మాత్ర‌మే ఇచ్చార‌ని - వారు మాట్లాడ‌కుండా ఆదేశాలు జారీ చేయ‌డంతోనేవారు మౌనం దాలుస్తున్నార‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తే.. అటు వారికి - ఇటు జ‌గ‌న్‌ కు కూడా పెను ప్ర‌మాద‌మే. కాబ‌ట్టి ఇప్ప‌టికైనా సబ్జెక్టుపై అవ‌గాహ‌న పెంచుకుని మంత్రులు ప్ర‌భుత్వ విధానాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

   

Tags:    

Similar News