సీఎంగా జగన్ బాధ్యతలు.. తొలి మూడు సంతకాలివే..

Update: 2019-06-08 05:21 GMT
ఆంధ్రప్రదేశ్ రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఇన్నాళ్లు తన ఇంటి నుంచి పాలన, బదిలీ వ్యవహారాలు చక్కదిద్దారు. శనివారం తొలిసారిగా ఆయన సీఎంగా అధికారికంగా ఏపీ సచివాలయంలోకి అడుగుపెట్టారు. జగన్ కు ఘనస్వాగతం లభించింది. తన తండ్రి వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించి బాధ్యతలు స్వీకరించారు.  జగన్ కు వేద పండితులు ఆశీర్వచనం గావించారు. ఈ సందర్భంగా జగన్ ముఖ్యమంత్రి సీట్లో ఆశీనులయ్యారు. ఇక జగన్ సీఎం గా బాధ్యతలు తీసుకోవడంతో కాబోయే మంత్రులు - పార్టీ నేతలు - ఉద్యోగులు జగన్ ను కలిసి అభినందించారు.

జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తొలి సారిగా మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం విశేషం. తొలి సంతకం అయిన ప్రకటించిన నవరత్న పథకాల్లో మొదటిది అయిన ఆశావర్కర్ల జీతం మూడు వేల నుంచి పదివేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పెట్టారు. ఇక అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకు అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. ఇక జర్నలిస్టులకు జగన్ వరం ప్రకటించారు. కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టు ఆరోగ్యపథకానికి సంబంధించిన ఫైల్ పైన జగన్ తన మూడో సంతకం చేశారు.

అంతేకాదు జర్నలిస్టు బీమాను 10 లక్షలకు పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించారు. ఇక సీఎస్ -డీజీపీ - అధికారులు స్వీట్లు తీసుకొచ్చి జగన్ కు తినిపించారు. శుభాకాంక్షలు చెప్పారు. ఈ నెల 10న కేబినెట్ సమావేశం తర్వాత నుంచి సచివాలయం కేంద్రంగా తన పాలనను జగన్ మొదలు పెట్టబోతున్నారు.
Tags:    

Similar News