అవినాష్ రెడ్డి ని తప్పించేస్తున్నారా.. జగన్ కొత్త వ్యూహం...?

Update: 2023-05-05 14:25 GMT
కడప జిల్లాలో వైసీపీకి ఎదురులేదు అన్నది తెలిసిందే. అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య తరువాత ఆ కేసుని సీబీఐ టేకప్ చేశాక కడపలో రాజకీయ సమీకరణలు మొత్తం మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే సీబీఐ దూకుడు చేస్తోంది.

అదే విధంగా చూస్తే ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇపుడు అవినాష్ వంతు అంటున్నారు. ఈ రోజు కాకపోయినా ఏదో నాటికి అరెస్ట్ అవుతారు అనే ప్రచారంలో ఉన్న మాట. ఒకవేళ అరెస్ట్ అయితే బెయిల్ మీద రావచ్చు. కానీ ఈ కేసులో సీబీఐ ఏమైనా ఆధారాలను తెచ్చి ఉచ్చు బిగిస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

దాంతో ముందు చూపుతో వైఎస్ జగన్ తన సొంత సీటు పులివెందులలో కొత్త ఇంచార్జిని నియమిస్తున్నారు అని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు వైఎస్ అవినాష్ రెడ్డి కి పెదనాన్న అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అయిన వైఎస్ అభిషేక్ రెడ్డి అని చెబుతున్నారు. అభిషేక్ రెడ్డి వృత్తి రిత్యా డాక్టర్. ఆయన వైసీపీలో వైద్య విభాగానికి ఇంచార్జిగా ఉన్నారు.

ఆయన 2019 ఎన్నికల వేళ పులివెందుల జమ్మలమడులల్లో పార్టీ కోసం పనిచేశారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వ్యూహాలను రూపకల్పన చేయడంతో పాటు ఎంతో ఓపికగా జనాల వద్దకు వెళ్లి వారి సమస్యలను వినే తీరు కూడా వైసీపీ హై కమాండ్ కి నచ్చింది. అందుకే ఆయన విశాఖలో సెటిల్ అయినా అర్జంటుగా తాడేపల్లి క్యాంప్ అఫీస్ కి రప్పించి మరీ పులివెందుల బాధ్యతలను చూడమని అప్పగించారని అంటున్నారు.

జగన్ ఆదేశాల మేరకు అభిషేక్ రెడ్డి పులివెందులలో ల్యాండ్ అయ్యారని అంటున్నారు. అయితే ప్రస్తుతం అవినాష్ రెడ్డి పులివెందుల బాధ్యతలు చూస్తున్నారు. ఆయన అభిషేక్ రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించే విషయంలో కొంత తాత్సారం చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది అని అంటున్నారు. నిజానికి గత పన్నెండేళ్ళుగా పులివెందుల మీద అవినాష్ రెడ్డి కుటుంబానిదే పెత్తనంగా ఉంది.

ఆ పెత్తనం అంతా ఇపుడు మారిపోతుందంటే కొంత ఆందోళన అవినాష్ రెడ్డి అనుచరులలో ఉంది అని అంటున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల వ్యవహారాలను చక్కబెట్టేవారు అని అంటారు. ఇక తాను సీబీఐ కేసులో ఉన్నానని అవినాష్ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం అభిషేక్ రెడ్డి ని తెచ్చి పెడుతోంది. ఇదే కొంత అవినాష్ రెడ్డి అనుచరులకు ఇష్టం లేదు అని అంటున్నారు.

అయితే ఇక్కడ జగన్ చెప్పిందే జరుగుతుంది కాబట్టి ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.  ఇదిల ఉంటే వైఎస్ ప్రకాష్ రెడ్డి అంటే జగన్ ఇష్టపడతారని  అంటున్నారు. పైగా ఆయనకు పులివెందులలో మంచి పేరు ఉంది. ఆయన మనవడిగా అభిషేక్ రెడ్డికి కూడా జనంలో మంచి పేరు ఉంది. దాంతో రానున్న ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీకలకంగా వ్యవహరించనున్నారని అంటున్నారు. ఏది ఏమైనా పులివెందుల అంటే ఒకప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి, ఆ తరువాత వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీగా ఉంది.

ఎందుకంటే వైఎస్సార్ ఉన్నపుడు వైఎస్ వివేకానందరెడ్డి చక్రం తిప్పేవారు. జగన్ పార్టీ పెట్టాక అవినాష్ రెడ్డి ఫ్యామిలీదే పై చేయిగా అక్కడ ఉంది ఇపుడు సీబీఐ కాసు అరెస్ట్ భయాలతో అవినాష్ రెడ్డి ఇబ్బ్నదుల్లో ఇరుక్కుపోవడంతో అభిషేక్ రెడ్డి రంగ ప్రవేశం చేయాల్సి వస్తోంది. మరి అభిషేక్ రెడ్డి దూసుకుపోయే తత్వం, యువకుడు కావడం,  వ్యూహాలు కూడా రచించే నైపుణ్యం ఉండడం ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి హవా కు అక్కడ బ్రేకు పడేలా చేస్తాయని అంటున్నారు. అయితే వైసీపీ కోసం  జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. దాన్ని కాదనే సీన్ ఎవరికీ లేదు అన్నది వాస్తవం. దాంతో ఇపుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి ఫ్యామిలీకి అభిషేక్ రెడ్డి రూపంలో మంచి రోజులు వచ్చాయని అంటున్నారు.

నేడో రేపో పులివెందుల వైసీపీ ఇంచార్జిగా అధికారిక బాధ్యతలను అభిషేక్ రెడ్డి స్వీకరించడం ఖాయమని అంటున్నారు. ఇక సీబీఐ ఈ కేసులో మరింత లోతుల్లోకి వెళ్ళి అరెస్ట్ తదనంతర సంఘటనలు జరిగితే మాత్రం అవినాష్ రెడ్డి ఇంకా ఇబ్బందుల్లో పడతారు. అపుడు అభిషేక్ రెడ్డి కడప ఎంపీ క్యాడిడేట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. చూడాలి పులివెందులలో వైఎస్సార్ ఫ్యామిలీలో ఈ రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందో.

Similar News