ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడా పెడా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు.అయితే.. ఈ నిర్ణయాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండటం విశేషం. తమ పార్టీ సభ్యురాలు ఆర్కే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన నేపథ్యంలో.. ఆమెపై వేసిన వేటును ఎత్తివేయాలని డిమాండ్ చేయటం.. దినకి ఏపీ అసెంబ్లీ ససేమిరా అన్న నేపథ్యంలో.. తాను.. తన పార్టీ సభ్యులు శీతాకాల సమావేశాలు మొత్తాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి.. అసెంబ్లీ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోవటం తెలిసిందే.
అలా బయటకు వెళ్లిన జగన్.. కొద్దిసేపటికే మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఒకవైపు.. శీతాకాల సమావేశాల్ని బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఎలా సాధ్యమన్న వాదన వినిపిస్తోంది. అయితే.. బాయ్ కాట్ మాటను పట్టించుకోకుండా ఉండటం లేదంటే.. అవిశ్వాస తీర్మానం అంశంపై వెనక్కి తగ్గటమన్నా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. చివరకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.