ఏపీ మంత్రుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఏపీ విపక్ష నేత వైఖరితో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు విపక్ష నేతను ఆహ్వానించాలని ప్రయత్నిస్తున్న ఏపీ మంత్రులకు జగన్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో వారు తెగ ఇదైపోతున్నారు.
శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ ను ఆహ్వానించే బాధ్యతను ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. దీంతో.. జగన్ ఫోన్ కు వారు ఫోన్ చేయటం.. రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తకపోవటం వారికి ఇబ్బందికరంగా మారింది. వరుసగా పలువురు మంత్రులు ఫోన్లు చేస్తున్నా లిఫ్ట్ చేయని పరిస్థితి. దీంతో.. వారు జగన్ పీఏ కు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు.
ఇంతమంది ఫోన్ల నుంచి ఫోన్ చేసినా ఎత్తకపోవటం చూస్తుంటే.. తమ్ముళ్ల నెంబర్లు జగన్ బ్లాక్ చేశారా? లేక.. శంకుస్థాపన వ్యవహారం పూర్తయ్యే వరకూ జగన్ వేరే నెంబర్ వాడుతున్నారా? అన్న సందేహం కలుగుతోంది. శంకుస్థాపనకు తనను ఆహ్వానించొద్దంటూ జగన్ పేర్కొనటం తెలిసిందే. తనను పిలవొద్దని.. తాను రానని చెప్పిన నేపథ్యంలో తమ్ముళ్లు ఎంతగా ట్రై చేసి ఫలితం ఉండటం లేదు. దీంతో.. జగన్ బాబు ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయవా? అని ఏపీ మంత్రులు వేడుకుంటున్నారు. వారి మొరను జగన్ ఆలకిస్తారా?