తాను ఏం అనుకుంటారో అది మాత్రమే చేసే వైఎస్ జగన్.. తాజాగా తన తీరు ఎలా ఉంటుందో మరోసారి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఏపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అవిశ్వాస తీర్మానం నోటీసు మీద విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం పెట్టకపోవటం.. ఆ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరగటంతోపాటు.. ఇది సరైన పద్ధతి కాదన్న వాదన పలువురి నోట వినిపించింది.
ఇదిలా ఉంటే తాజాగా స్పీకర్ మీద అవిశ్వాసతీర్మానం ఇచ్చిన విపక్షం.. తాజాగా ఇచ్చిన తీర్మాన నోటీసులోనూ విపక్ష నేత జగన్ సంతకం పెట్టలేదన్న విషయాన్ని శాసనసభాపక్ష నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఏపీ సర్కారు మీద ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టని జగన్.. తాజాగా స్పీకర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మీద కూడా సంతకం పెట్టకపోవటం పలువురుని విస్మయానికి గురి చేస్తోంది. తొలిరోజు పొరపాటున సంతకం పెట్టలేదని సరిపెట్టుకున్న వారు సైతం.. సంతకం మీద అంత రచ్చ జరిగిన తర్వాత తాజా నోటీసుపై జగన్ సంతకం పెడతారని భావించినా.. అందుకు భిన్నంగా ఉండటం చూస్తే.. జగన్ తీరు కాస్త భిన్నమన్న విషయం మరోసారి నిరూపితమైందని చెప్పక తప్పదు.