ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఏం మాట్లాడుకున్నా.. అదంతా కరోనా చుట్టూనే నడుస్తోంది. ఆ మాటకు వస్తే.. మనమే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా గురించి మాత్రమే మాట్లాడుకుంటోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ కరోనాకు మించి మాట్లాడేవారే కనిపించట్లేదు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా మాస్కులకు.. శానిటైజర్లకు నెలకొన్న కొరత అంతా ఇంతా కాదు. మన దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ శానిటైజర్ల కొరత భారీగా నెలకొని ఉంది. దీంతో వీటి ధరలకు రెక్కలు వచ్చాయి.
ఇలాంటివేళ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదిరే ఆలోచన చేశారు. నిజానికి చాలా రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మద్యం దుకాణాలు మూసివేయటం.. ఇతర వస్తువుల ఉత్పత్తిని నిలిపివేసిన వేళ.. శానిటైజర్లు తయారీ చేసే సామర్థ్యం ఉన్న డిజ్టలరీలకు ఆ పని అప్పజెబితే కలిగే ప్రయోజనం ఎంతో.
ఏపీ వరకూ వస్తే.. రాష్ట్రంలో 16 డిస్టలరీలు ఉన్నాయి. వాటన్నింటికి శానిటైజర్లు తయారు చేసేందుకు వీలుగా లైసెన్సులు జారీ చేస్తే సరిపోతుంది. అవి కానీ శానిటైజర్ల ఉత్పత్తి స్టార్ట్ చూస్తే.. భారీ అమ్మకాలతో పాటు.. ఆయా రాష్ట్రానికి ఆదాయం లభించటమే కాదు.. ప్రజలకు మరింత సురక్షితంగా మారుతుంది. చాలా రాష్ట్రాల్లో పాలకులు ఈ చిన్న అంశం మీద ఫోకస్ పెట్టకపోవటంతో.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న డిస్టలరీలు మూసివేశారే తప్పించి.. శానిటైజర్ల ఉత్పత్తి దిశగా అడుగులువేయటం లేదు.
ఈ లోటును తీరుస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శానిటైజర్లు తయారీకి అనుమతులు ఇచ్చారు. శానిటైజర్లను తయారీ చేయాలంటే రెక్టిఫైడ్ స్పిరిట్ అవసరం. ఇందులో ఆల్కహాల్.. ఇథనాల్ ఉంటాయి. డిస్టలరీల వద్ద రెక్టిఫైడ్ స్పిరిట్ ఉంటుంది. దీంతో.. వారు శానిటైజర్లను తయారు చేసే అవకాశం ఉంది. కాకుంటే.. ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో డిస్టలరీలు ఎవరైనా శానిటైజర్లు తయారు చేస్తామంటూ లైసెన్స్ లకు అప్లై చేస్తే.. రెండు.. మూడు గంటల్లోనే ఏపీ సర్కారు అనుమతి ఇచ్చేస్తుంది. ఈ కారణంగా శానిటజైర్ల కొరతకు చెక్ పెట్టే అవకాశం ఉంది. ఇలాంటి ఆలోచన చేసిన సీఎం జగన్ ను అభినందించాల్సిందే.