జగన్ డేర్..లోకల్ పోల్స్ సాంతం ఛేంజ్

Update: 2020-02-12 17:14 GMT
నవ్యాంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం మారిపోయిందనే చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూడా జగన్ సర్కారు పూర్తిగానే మార్చేసింది. ఈ మేరకు బుధవారం జగన్ నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుల్లో భాగంగా అడ్డదారులు తొక్కి గెలవాలనుకునే వారిని ఏకంగా ఎన్నికల ప్ర్రక్రియ నుంచే తొలగించేందుకు కూడా జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

నవ్యాంధ్రలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కూడా సదా సిద్ధంగానే ఉందని కూడా చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. ఈ కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చి... హైకోర్టు ఎప్పుడు ఎన్నికలు జరపమంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే మాటను బుధవారం జరిగిన కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చెప్పేశారు.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మారిన ప్రక్రియ ఎలా ఉందన్న విషయానికి వస్తే... నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించే ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహాలిస్తారట. స్థానికులను ప్రోత్సహించే విధంగా చట్టాలను తేవాలని తీర్మానించినట్లు చెప్పారు. గ్రామంలో ఉండే వారే సర్పంచులుగా పోటీ చేయాలని,  100 శాతం గిరిజన జనాబా ఉన్న దగ్గర కేవలం గిరిజనులే పోటీ చేసేలా మార్పులు చేస్తారట పంచాయతీ రాజ్ చట్ట సవరణ ద్వారా ఎన్నికల్లో ధన, మద్య ప్రలోబాలను తగ్గించేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. అంటే... ఓటర్లకు మద్యం, డబ్బు ఎరవేయాలని చూసే వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి బహిష్కరించేస్తారన్న మాట. ఎంపీటీసీ - జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు18 రోజులు, సర్పంచ్ ఎన్నికలకు 13 రోజులపాటు ఎన్నికల ప్రక్రియ వుంటుందన్నారాయన. పచ్చదనం - పారిశుధ్యం బాధ్యతలను సర్పంచులే చేపడతారట. లా చట్టంలో మార్పులు చేశామని చెప్పారు.


Tags:    

Similar News