పార్టీలంటేనే.. కుమ్ములాటలు, పోరాటాలు, అసమ్మతులు, అసంతృప్తులు.. ఇలా పార్టీని నడపడం అంత ఈజీకాని పరిస్థితులు నేడు నెలకొన్నాయి. వ్యతిరేక వర్గాల తప్పుడు ప్రచారాలను కాచుకొని.. నిలబడడం అంత ఈజీ కాదు.. ఇలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా - మీడియాలో అయితే జగన్ వైఖరిని ఎండగడుతూ ‘కోపిస్టి’ అని.. గర్వం గల వారు అని.. నాయకులను అగౌరపరుస్తారని.. మర్యాదలు ఇవ్వరని.. ఇలా ఎన్నో హాట్ హెడ్డింగ్ లతో కథనాలను ఆయన ప్రత్యర్థులు వండివారుస్తూనే ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ ల మీద జగన్ విమర్శలను సైతం కొంపలు మునిగిన చందంగా ప్రచారం చేస్తుంటారు ఆయన ప్రత్యర్థులు.
పలు సభలు, సమావేశాల్లో చంద్రబాబు విషయంలో జగన్ చేసిన విమర్శలు పాపులర్ అయ్యాయి. అయితే ఆయన ప్రత్యర్థులు జగన్ విమర్శలను చంద్రబాబుపై సానుభూతికి వాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా చేయని విమర్శలను జగన్ అన్నారని తిమ్మిని బమ్మి చేసి చంద్రబాబు రాజకీయంగా లబ్ధి పొందారు.
ఈ వరుస గుణపాఠాల నుంచి జగన్ ఎంతో నేర్చుకున్నారని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. వంగవీటి రాధా వైసీపీని వీడడం.. ఆ తర్వాత జగన్ పై పలు సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. రాధా నిష్క్రమణపై వైఎస్ జగన్ ఎలా రియాక్ట్ అవుతారోనని రాజకీయ పరిశీలకులు, ప్రత్యర్థులు ఆసక్తిగా గమనించారు. కానీ రాధా విమర్శలను, సంచలన కామెంట్లను జగన్ బాగా ప్రశాంతతతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు.
జగన్ తాజాగా వంగవీటి రాధా పార్టీ నుంచి నిష్క్రమణపై తొలిసారి స్పందించారు. ‘రాధా ఎక్కడ ఉన్నా బాగుండాలి’ అని ఏకవాక్యంతో ముగించారు. రాధా తనపై ఎన్నో పదునైన విమర్శలు చేసినా జగన్ ఒక్క మాటతో వాటన్నింటిని చెరిపేసినట్టైంది. రాధాపై జగన్ కామెంట్ చేస్తే రచ్చ చేయడానికి కొన్ని శక్తులు కాచుకు కూర్చుకున్నాయి. కానీ జగన్ ఎంతో పరిణతితో , పరిపక్వతతో వ్యవహరించి రాజకీయాల్లో ఎలా ఉండాలో .. ఎంత ఓపిక అవసరమో ఒక్క మాటతో తేటతెల్లం చేశారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..
వంగవీటి రాధా పదునైన విమర్శలకు జగన్ ధీటుగా బదులిస్తాడని టీడీపీ - జనసేన నేతలు భావించారు. రాధాపై జగన్ నోరు జారితే వాటిని రాజకీయం చేసి కాపు సామాజికవర్గంతో లబ్ధి పొందాలని టీడీపీ భావించింది. జగన్ బలహీనతలు , కోపాన్ని ఎత్తి చూపాలని స్కెచ్ గీసిందట.. కానీ వారి కుట్రలకు జగన్ చిక్కలేదు. ప్రత్యర్థులకు రాధా విషయంలో ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. రాధా బావుండాలి అన్న ఒక్క పదంతో జనంలో జగన్ ప్రతిష్ట ఎంతో పెరిగినట్టైంది.
రాధా టీడీపీలో చేరికను వ్యతిరేకిస్తున్న కాపు సామాజికవర్గం కూడా జగన్ స్పందనను స్వాగతించారు. రాజకీయాల్లో సిసలైన రాజకీయ నాయకుడు ఎలా వ్యవహరించాలో రాధా విషయంలో జగన్ అలానే వ్యవహరించాడని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాల్లో జగన్ పరిణతికి ఇది నిదర్శనమని చెబుతున్నారు. జగన్ లో ఈ మార్పు వెనుక పొలిటికల్ అనలిస్టు ప్రశాంత్ కిషోర్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఎవరున్నా.. లేకపోయినా.. రాజకీయంగా జగన్ లో వచ్చిన ఈ గొప్ప మార్పు ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.