వాళ్లందరిని పంపించేయండి..సీఎం ఆఫీస్ నుంచి ఆదేశం!

Update: 2019-06-13 04:27 GMT
గత ప్రభుత్వ హయాంలో సచివాలయంలో నియమితమైన ప్రైవేట్ వ్యక్తులు - ప్రత్యేక అధికారులు - వ్యక్తిగత కార్యదర్శులు - వ్యక్తిగత సహాయకులు..  ఈ హోదాల్లోని వారందరినీ సాగనంపాలని తమ పార్టీ  నూతన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సీఎం ఆఫీస్ నుంచి ఈ మేరకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంత్రులకు ఈ ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు  నియమితం అయిన అలాంటి వారందరినీ తక్షణం తొలగించాలని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అప్పట్లో చాలామంది పచ్చచొక్కాల వాళ్లు సచివాలయంలో నియమితం అయ్యారు. లోకేష్ అందుకు సంబంధించి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంకా మంత్రి పదవిని స్వీకరించక మునుపే లోకేష్ బాబు సచివాలయం నిండా తన వారిని నింపారు.

మంత్రుల పేషీల్లో లోకేష్ మనుషులు  ప్రత్యేకంగా నియమితం అయ్యారు. ఆ తర్వాత కూడా అనేక మంది సచివాలయంలో అలా సెటిలయ్యారు. ప్రభుత్వం మారినా ఇప్పటి  వరకూ  వారిని తొలగించింది లేదు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఆఫీస్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చిందని - అప్పటి  వారందరినీ సాగనంపాలని మంత్రులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
Tags:    

Similar News