జ‌గ‌న్ మ‌హాపాద‌యాత్ర‌కు డేట్ ఫిక్స్‌

Update: 2017-09-29 06:21 GMT
ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు దుష్ట‌పాల‌న‌ను ఎండ‌గ‌ట్ట‌టంతో పాటు.. రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకునేందుకు ఏపీ విప‌క్ష నేత భారీ సంక‌ల్పానికి తెర తీశారు. ఏపీ వ్యాప్తంగా పాద‌యాత్ర చేయాలని నిర్ణ‌యించారు. ఈ విష‌యాన్ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. తాజాగా మాత్రం పాద‌యాత్ర ఎలా ఉండాలి? ఎక్క‌డ నుంచి స్టార్ట్ కావాలి? ఎక్క‌డ ఎండ్ కావాలి? ఏయే ప్రాంతాల్లో ప‌ర్య‌టించాలి?  లాంటి అంశాల‌కు సంబంధించి తాజాగా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

న‌వంబ‌రు 2న క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ నుంచి జ‌గన్ మ‌హాపాద‌యాత్ర మొద‌లుకానుంది. దీనికి ఒక రోజు ముందు తిరుమ‌ల‌లో శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటారు. అనంత‌రం తిరుమ‌ల నుంచి ఇడుపులపాయ‌కు వెళ్లి..అక్క‌డ నుంచి త‌న పాద‌యాత్ర‌ను జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.

క‌డ‌ప‌.. అనంత‌పురం.. క‌ర్నూలు.. చిత్తూరు.. నెల్లూరు..ప్ర‌కాశం.. గుంటూరు..కృష్ణ‌.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు.. విశాఖ‌.. విజ‌య‌న‌గ‌రం.. చివ‌ర‌గా శ్రీకాకుళం జిల్లా స‌రిహ‌ద్దు ఇచ‌చాపురంతో త‌న పాద‌యాత్ర‌ను ముగించ‌నున్నారు. జ‌గ‌న్ మ‌హా పాద‌యాత్ర‌కు సంబంధించిన రూట్ మ్యాప్ ను జ‌గ‌న్ పార్టీ నేత‌లు వెల్ల‌డించారు. సుదీర్ఘంగా సాగ‌నున్న జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఎదుర‌వుతున్న క‌ష్టాలు.. బాబు పాల‌న‌లో చోటు చేసుకున్న అవినీతి అక్ర‌మాలపై పెద్ద ఎత్తున జ‌గ‌న్ విరుచుకుప‌డ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని తాడేప‌ల్లిలో గేటెడ్ క‌మ్యూనిటీ కింద నిర్మించే వెంచర్లో ఎక‌రం విస్తీర్ణంలో స్థ‌లాన్ని జ‌గ‌న్ కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇందులో స‌గం ఇంటి కోసం మ‌రో స‌గం పార్టీ కోసం వినియోగిస్తార‌ని చెబుతున్నారు. 2018 ఏప్రిల్ నాటికి ఈ నిర్మాణాలు పూర్తి అయ్యేలా ప్ర‌య‌త్నిస్తున్నారు.
Tags:    

Similar News