వినూత్న నిర్ణయాలతో పాలనా రథాన్ని పరుగులు తీయిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం ఏపీ అధికారులు చేస్తున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే జనవరి నుంచి ఏపీలో పెద్ద ఎత్తున నిర్వహించనున్న సమగ్ర భూసర్వే కోసం ముఖ్యమంత్రి జగన్ బొమ్మలతో కూడిన సర్వే రాళ్లను తయారుచేయించటం ఆసక్తికరంగా మారింది. సర్వే కోసం జగన్ నిర్వహించే రివ్యూలో భాగంగా.. సీఎంకు చూపించేందుకు అధికారులు రాళ్లపై జగన్ బొమ్మలు చెక్కించినట్లుగా చెబుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భూసర్వే సందర్భంగాఆయా స్థలాల్లో ప్రభుత్వం సరిహద్దుల రాళ్లను ఏర్పాటు చేయనున్నారు. దీనిపై సర్వే వివరాలు.. ఏపీ సర్కారు చేపట్టిన కార్యక్రమంగా పేర్కొనటం వరకు బాగున్నా.. సీఎం జగన్ బొమ్మల తో కూడిన రాళ్లను చెక్కించటం ఇప్పుడు చర్చగా మారింది. మొత్తం మూడు మోడల్స్ లో ఉన్న ఈ రాళ్లను ముఖ్యమంత్రి కి చూపిస్తారని చెబుతున్నారు.
ఒకవైపు బాణం గుర్తు..మరోవైపు సమగ్ర భూసర్వే 2021 అని రాయించి.. సీఎం జగన్ బొమ్మ ను గీయించారు. సాధారణం గా సర్వే హద్దుల రాళ్లు గా.. మామూలు కొండరాళ్లను వాడతారు. వీటి ధర తక్కువగా ఉంటుంది. అయితే.. ఈ రాళ్ల మీద ముఖాల్ని చెక్కిస్తే బొమ్మ సరిగా రాదు. అందుకే కాబోలు.. ప్రత్యేకంగా గ్రైనెట్ రాళ్ల మీద జగన్ బొమ్మల్నిచెక్కించారు అధికారులు. వీటిని సీఎం కానీ ఓకే చేస్తే.. అదే తీరులో సిద్ధం చేస్తారని చెబుతున్నారు. అయితే.. దీనికి అయ్యే ఖర్చు భారీగా ఉంటుందని.. పెద్ద ఎత్తున రాళ్లు కూడా అవసరమవుతాయని చెబుతున్నారు.
ఏపీలో మొత్తం 1.35 కోట్ల సర్వే నెంబర్లు ఉన్నాయని.. 49 లక్షల భూమి ఫోటోలు ఉన్నాయని.. 1.59 కోట్లసబ్ డివిజన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్కో సర్వే నెంబరు వద్ద నాలుగు సరిహద్దు రాళ్లు వేసినా.. మొత్తంగా 5కోట్ల గ్రానైట్ రాళ్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. మరిన్నిరాళ్లు.. వాటి మీద సీఎం జగన్ బొమ్మలు చెక్కించటం.. అంటే అదోపెద్ద ప్రాసెస్ అవుతుంది. ఖర్చు కూడా అవుతుంది. మరి.. ఈ ప్రపోజల్ ను సీఎం జగన్ ఓకే చేస్తారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.