మజా అంతా మండలిలోనే ఉందిగా !
ఈ క్రమంలో శాసనమండలిలో వాడి వేడి చర్చ సాగుతోంది. అక్కడ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు అన్నట్లుగా సభలో కొంత సాగింది.
సాధారణంగా ప్రజాస్వామిక దేశంలో పార్లమెంటరీ విధానంలో ఎగువ సభలు సుదీర్ఘమైన చర్తలు చేస్తాయి. ఒక బిల్లు ఎఉగువ సభకు వచ్చినప్పుడు అక్కడ దాని మంచి చెడుల మీద సమాజం మీద చూపించే ప్రభావం మీద లోతైన చర్చ సాగుతుంది.
ఎగువ సభలలో మేధావులు పెద్దలు వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు ఉంటారు. దిగువ సభలో ఏ కారణం చేతనైనా బిల్లులో తెలియకుండా లోపాలు ఉంటే వాటిని ఇక్కడ ఒకటికి పది సార్లు చెక్ చేసి పూర్తి ప్రజామోదమైన బిల్లుని సభలోకి వచ్చేలా చూస్తారు. ఆనక అది చట్టంగా మారి సర్వ జన ప్రయోజనకరంగా మారుతుంది.
పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రాసెస్ ఇలా ఉంటుంది. అందుకే కో ఎగువ దిగువ సభలను కప్పూ సాసర్ తో ప్రజాస్వామ్య నిపుణులు మేధావులు పిలుస్తారు. ఆవేశంతో చేసే కొన్ని కీలక డెసిషన్లు చట్టాలుగా మారకుండా ఆ వేడి చల్లార్చే విధంగా నిశిత పరిశీలనతో ఆలోచనాత్మకమైన చర్చలతో ఎగువ సభలు పనిచేయడానికే వాటిని ఏర్పాటు చేశారు.
మన దేశంలో రాజ్యసభ ఎగువ సభ అయితే లోక్ సభ దిగువ సభ, ఇక రాష్ట్రాలలో ఎగువ సభ అంటే శాసన మండలి, ఇదుగువ సభ అంటే శాసన సభ. వీటినే కౌన్సిల్ అసెంబ్లీ అని కూడా పిలుస్తారు ఇక చూడబోతే సాధరణంగా దిగువ సభలలో రాజకీయ చర్చలు వాడి వేడిగా సాగుతాయి. అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం మధ్య ఆవేశ కావేశాలు చాలా ఉంటాయి. ప్రభుత్వం చేపట్టే బిల్లుల మీద తీవ్ర విమర్శలు చేస్తూ విపక్షం తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంది. దాన్ని కౌంటర్ చేస్తూ అధికార పక్షం ఉంటుంది.
ఇలా అసెంబ్లీ సమావేశాలు అట్టుడికిపోవడమే ఇంతకాలం అంతా చూసారు. కానీ తొలిసారి అసెంబ్లీలో చల్లగా కూల్ గా సమావేశాలు జరుగుతున్నాయి. అదే శాసనమండలిలో మాత్రం వేసవి కాలం వేడిని తలపించేలా చర్చలు సాగుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఇది అందరికీ తెలిసిన ఇంట్రెస్టింగ్ మ్యాటరే.
ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో విపక్ష హోదా దక్కలేదు. ఇక ప్రతిపక్షంగా గుర్తించమంటూ ఆ పార్టీ అధినేత జగన్ కోరుతూ వస్తున్నారు. దాంతో ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అంతా కలసి అసెంబ్లీకి రావడం లేదు. అక్కడ అంతా అధికార కూటమి ప్రభుత్వమే కనిపిస్తోంది.
దాందో అసెంబ్లీ సమావేశాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక శాసనమండలి విషయానికి వస్తే అక్కడ అధికార కూటమికి బలం తక్కువగా ఉంది. వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా వైసీపీకి ఉంది.
సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ లీడర్ ఆఫ్ అపొజిషన్ గా ఉన్నారు. దాంతో పాటు వైసీపీలో సీనియర్ నేతలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ క్రమంలో శాసనమండలిలో వాడి వేడి చర్చ సాగుతోంది. అక్కడ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు అన్నట్లుగా సభలో కొంత సాగింది. అలాగే వరుదు కళ్యాణి వర్సెస్ మంత్రి అనిత అన్నట్లుగానూ సాగింది.
మంత్రి నారా లోకేష్ మండలిలోనే తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఆయన అంతలా ఫైర్ అవడం ఎవరూ ఎపుడూ చూడలేదు, ఇలా మండలిలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ వైసీపీ నుంచి గట్టిగానే ప్రశ్నలు వస్తుండడంతో కొఇటమి మంత్రులు ఎక్కువ మంది మండలి డిబేట్ కి వెళ్తున్నారు.
కూటమి ప్రభుత్వం సైతం మండలిలో వైసీపీ చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని మంత్రుల ద్వారా సమాధానాలను చెప్పిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు మహా మహులు ఎంతో మంది ఉన్న అసెంబ్లీలో కంటే మండలిలో జరిగే చర్చ మీదనే ఆసక్తి పెరుగుతోంది. ఆ విధంగా మండలిలోనే మజా అంతా ఉందని అంటున్నారు.