జ‌గ‌న్ కు సొంత‌మైన 'చిన్న వ‌య‌సు సీఎం'

Update: 2019-05-31 06:57 GMT
ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం తెలిసిందే. తాజాప్ర‌మాణ‌స్వీకారంతో  జ‌గ‌న్ మ‌రో రికార్డును త‌న సొంతం చేసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీకి ముఖ్య‌మంత్రులుగా అయిన వారిలో అత్యంత పిన్న వ‌య‌స్కులు జ‌గ‌నే అవుతారు. ఇదిలా ఉంటే.. దేశంలో అతి చిన్న వ‌య‌సులో ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టిన వారి క్ల‌బ్ లో జ‌గ‌న్ చోటు ద‌క్కించుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో అతి చిన్న వ‌య‌సు సీఎంగా చూస్తే.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఫెమా ఖండు అతి చిన్న సీఎంగా చెప్పాలి. ఆయ‌న వ‌య‌సు 39 ఏళ్లు మాత్ర‌మే. ఫార్టీ కంటే త‌క్కువ వ‌య‌సుకే సీఎం అయిన అతి కొద్ది మందిలో ఆయ‌న ఒక‌రు.

ఇదిలా ఉంటే.. రెండో స్థానంలో మేఘాల‌య ముఖ్య‌మంత్రి క‌ర్నాడ్ సంగ్మా ఉన్నారు. ఆయ‌న వ‌య‌సు 41 ఏళ్లు మాత్ర‌మే. మూడో స్థానంలో గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ నిలుస్తారు. ఆయ‌న వ‌య‌సు 46 సంవ‌త్స‌రాలు. ఇక‌.. నాలుగో స్థానంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యోగి ఆదిత్య‌నాథ్ ను చెప్పాలి. ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్ ఐదో స్థానంలో నిలిచారు.

ఈ టాప్ ఫైవ్ లో చూస్తే.. జ‌గ‌న్ కాకుండా మిగిలిన ముగ్గురు చిన్న రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రులుగా చెప్పాలి. యూపీ సీఎంగా ఉన్న యోగి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న నేరుగా సీఎం అయ్యింది లేదు. మోడీ పుణ్య‌మా అని.. ఆయ‌న ఎంపిక చేయ‌టంతోనే సీఎం అయ్యారు త‌ప్పించి.. త‌న‌కు తానుగా.. త‌న ఛ‌రిష్మాతో సీఎం అయ్యింది లేదు. కానీ.. జ‌గ‌న్ అలా కాదు. త‌న సొంత బ‌లంతో.. త‌న‌కున్న ఇమేజ్ తో ప్ర‌తికూల‌తల్ని.. స‌వాళ్ల‌ను అధిగ‌మించి మ‌రీ సీఎం అయ్యార‌ని చెప్పాలి.  ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు అతి చిన్న‌వ‌య‌సు క్ల‌బ్ లో జ‌గ‌న్ ఐదో స్థానంలో నిలిచిన‌.. స్వ‌శ‌క్తితో.. సొంతంగా ఒక కీల‌క రాష్ట్రానికి సీఎం అయిన ఘ‌న‌త విష‌యంలో జ‌గ‌న్ కు తిరుగులేద‌ని చెప్పాలి.

ఈ విష‌యం ఇలా ఉంటే.. అతి చిన్న వ‌య‌సులో ఉన్న‌ సీఎం క్ల‌బ్ లో ఆరో స్థానంలో త్రిపుర సీఎం బిప్ల‌వ్ దేవ్ నిలుస్తారు. ఆయ‌న వ‌య‌సు 47 ఏళ్లు.  ఏడో స్థానంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.. ఎనిమిదో స్థానంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నిలుస్తారు. ఆయ‌న వ‌య‌సు 50 ఏళ్లు. త‌ర్వాతి స్థానాల్లో సిక్కిం ముఖ్య‌మంత్రి ప్రేమ్ సింగ్ త‌మాంగ్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ లు నిలుస్తారు. మొత్తం ఈ ప‌ది మంది ముఖ్య‌మంత్రులు 54 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న వారు కావ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News