జగన్ ప్లాన్స్ బాబుకు ముందే తెలుస్తున్నాయా?

Update: 2019-01-31 12:38 GMT
రహస్యంగా సర్వేలు చేయడంలోనే కాదు, ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలుకుంటుంటారు చంద్రబాబు. ఈ మేరకు ప్రతి పార్టీలో ఆయనకు అనుచరులు ఉన్నారనే వార్తలు ఎప్పట్నుంచో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లు మరోసారి తెరపైకి వచ్చాయి. దీనికి కారణం వైసీపీ పార్టీ.

అవును.. నాలుగు గోడల మధ్య జగన్ చేస్తున్న చర్చలు యథాతథంగా టీడీపీకి చేరిపోతున్నాయట. మొన్నటికి మొన్న బీసీ గర్జన నిర్వహించాలని జగన్ భావిస్తే - ఆ మేటర్ చంద్రబాబుకు తెలిసిపోయిందట. వెంటనే ఆయన జయహో బీసీ అంటూ ఓ భారీ సభ పెట్టేశారట. ప్రస్తుతం ఈ లీకుల మేటర్ పైనే వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది.

తమ పార్టీ నుంచి అత్యంత కీలకమైన సమాచారం తెలుగుదేశం పార్టీకి ఎలా చేరుతుందనే విషయంపై ప్రస్తుతం జగన్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా వైసీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారా అనే యాంగిల్ లో అంతర్గతంగా విచారణ చేపడుతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News