జగన్ ‘ఆట’ విడుపు

Update: 2016-06-25 09:45 GMT
 నిత్యం తీరిక లేకుండా గడిపేవారికి ఒక్క రోజు విరామం దొరికితే చాలా ఎంతో రీఛార్జి అవుతారు. అలాంటిది ఏకంగా వారినికపైగా సమయం దొరికి.. అది కూడా విదేశాల్లో హాయిగా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఛాన్సొస్తే ఇంకేమైనా ఉందా. పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయి ఆటపాటలతో సరదాగా గడిపేస్తారు. వైసీపీ అధినేత జగన్ కూడా అందుకు మినహాయింపు కాదు.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ అక్కడ భార్యాబిడ్డలతో కలిసి హాయిగా గడుపుతున్నారు. అక్కడ ఏ రోజు ఏం చేస్తున్నారన్నది సోషల్ మీడియాలో వస్తుండడంతో ఆయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా జగన్ వివిధ ఆటల్లో మునిగితేలుతున్న ఫొటోలు వస్తుండడంతో ‘‘సార్.. జాలీగా ఉన్నారు’’ అనుకుంటున్నారట అనుచరులంతా.

మొన్న ఎడిన్బరోలో గోల్ఫ్ ఆడుతూ కనిపించిన జగన్ నిన్న చెస్ ఆడుతూ కనిపించారు. తాజా ఫొటోల్లో ఆయన పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడుతూ కనిపించారు. వంగపండు రంగు టీ షర్టు - బ్లూ జీన్సు - స్పోర్ట్సు షూ వేసుకున్న జగన్ కొద్దిగా మాసిన గడ్డంతో కనిపిస్తున్నా కూడా మంచి ఉత్సాహంగా కదులుతూ ఫుట్ బాల్ ఆడుతున్న ఫొటోలు మీడియాలో వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫుట్ బాల్ చిత్రాలు కూడా అక్కడివే అన్నట్లు సమాచారం. మరో మూడు రోజుల్లో తన విదేశీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాదు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
Tags:    

Similar News