జగన్ పీఆర్వో టీం అట్టర్ ఫ్లాప్..ప్లానింగ్ ఏమిటో..?

Update: 2020-02-24 08:15 GMT
కొత్తగా అధికారంలోకి వచ్చారు.. సంక్షేమ పథకాల బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలో చేసేది తక్కువ ఉన్నా ఎక్కువ ప్రయోజనం ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పీఆర్ టీం. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వం తీవ్ర విఫలమైనట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. తక్కువ పని చేసి ఎక్కువ ప్రచారం చేసుకోవడంలో బాబును మించిన వారు ఎవరూ లేరు. అయితే జగన్ మాత్రం ఈ విషయంలో ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియకుండా పోతున్నాయి. విశేషమైన రోజుల్లో తన కార్యక్రమాలు ఉంటుండడంతో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు.

జగన్ ఇటీవల వరుస పర్యటనలు చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఆ విషయాలు పెద్దగా ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే ఆ సమయంలో జగన్ పర్యటన కన్నా ఇంకో వేరే కార్యక్రమాలు ఉండడంతో జగన్ పర్యటన మరుగున పడిపోయింది. ఇలా ఒకటి రెండు సార్లు కాదు.. చాలాసార్లు ఇదే మాదిరి అయ్యింది. ఎందుకంటే తాజాగా భారత్ మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన పైనే ఫోకస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ట్రంప్ పర్యటనను ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పథకం ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలో జగనన్న వసతి కార్యక్రమం జగన్ ప్రారంభించారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటనకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ఎందుకంటే ప్రజలంతా ట్రంప్ పర్యటనను చూడడానికి టీవీలకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎవరికీ తెలియకపోయింది.

అయితే గతంలో కూడా జగన్ పర్యటనలు ఈ విధంగానే ప్రాధాన్యం లేకుండాపోయాయి. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టారు. అయితే అదే రోజున జగన్ అమ్మ ఒడి పథకం ప్రారంభించారు. ప్రజలందరూ కేంద్ర బడ్జెట్ పై దృష్టి సారించారు. కేంద్రం ఏం ప్రకటించింది.. మనకేమైనా సానుకూల నిర్ణయాలు తీసుకుందా అనే విషయాలపై ప్రజలంతా చర్చించుకున్నారు. అయితే ఆ రోజు జగన్ ప్రారంభించిన పథకంపై పెద్దగా చర్చ సాగలేదు. మీడియా కూడా అంతగా ఫోకస్ చేయలేదు. అంతకుముందు కర్నూల్ లో మున్సిపల్ ఆఫీస్ లపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలో జగన్ కర్నూల్ పర్యటించాడు. దీంతో ఆ పర్యటన వివాదాస్పదమైంది. ఈ విధంగా జగన్ పర్యటనకు ప్రాధాన్యం లేకుండాపోయింది.

తాజాగా ట్రంప్ భారత పర్యటన రోజునే జగన్ జగనన్న దీవేన పథకాన్ని ప్రారంభించాడు. దీంతో జగన్ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. మీడియా కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇలాంటి కీలక రోజుల్లో జగన్ పర్యటనను ఎవరూ గమనిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ప్లానింగ్ విషయంలో పీఆర్వోలు విఫలమవుతున్నారని పలుమార్లు నిరూపితమవుతోంది. ప్లానింగ్ చేసేటప్పుడు ముందుగానే ఊహించాలి. ఆ సమయంలో ఏం కార్యక్రమాలు ఉన్నాయి.. ఏ రోజు ఏముంది.. దేశంలో ఏ కార్యక్రమాలు ఉన్నాయి.. ఎప్పుడూ ఏ కార్యక్రమం ఉండాలనే విషయంలో ముందస్తుగానే ఊహించాలి. ఒకటీ రెండుసార్లు దీనిపై చర్చించుకోవాలి. ఈ విషయంలో సమాచార శాఖ.. పీఆర్వో వ్యవస్థ విఫలమవుతోంది.
Tags:    

Similar News