దిశ నిందితుల విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుపై అభినందల వర్షం కురిపించారు ఏపీ సీఎం జగన్. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళల భద్రతపై చర్చ జరిగింది.. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ దిశ నిందితుల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.
వారం రోజుల్లోనే కేసును చేధించి నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులకు - సీఎం కేసీఆర్ ను జగన్ ప్రశంసించారు.. ‘హ్యాట్సాఫ్ టు తెలంగాణ సీఎం కేసీఆర్.. హ్యాట్సాఫ్ టు తెలంగాణ పోలీస్ ’ అని నిండు సభలో జగన్ అభినందించారు.
సినిమాల్లో దోషులను చంపితే చప్పట్లు కొడుతామని.. నిజ జీవితంలో దమ్మున్న వారు ఎవరైనా ఇలాంటి పనిచేస్తే మానవ హక్కుల కమిషన్ అంట ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తప్పు అని చెబుతోందని.. ఇంత దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళల భద్రతకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. మద్యం వల్లే మనుషులు మృగాలుగా మారిపోతున్నారని.. దిశ ఉందంతం మద్యం తాగడం వల్లే జరిగిందని.. అందుకే ఏపీలో మద్యం నిషేధం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.