దివంగత నేత వైఎస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక కొత్త అలవాటుఅధికారపక్షానికి అలవాటు అయ్యిందని చెప్పాలి. ఏడాదికి ఒకసారి సర్వే నిర్వహించటం ఆయన మొదలుపెడితే.. ఆయన తర్వాత.. ఆర్నెల్లకోసారి సర్వే చేయించటమేకాదు.. చివరకు ఎమ్మెల్యేలు సైతం ఎవరికి వారు.. సొంత సర్వేలు చేపట్టటం తెలిసిందే.
ఇక.. లగడపాటి లాంటి ఔత్సాహికులైతే.. మీడియా సంస్థలు.. పార్టీకి సంబంధం లేకుండా తనదైన సర్వేలు చేయించి.. ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పుకునేవారు.
పదేళ్ల విరామం తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం సర్వేల మీద ఎంతగా ఆధారపడతారో తెలిసిన విషయమే. తాజాగా ఆయన ఏపీలోని 175 అసెంబ్లీ స్థానలపై సర్వే నిర్వహించిన విషయం ఆయనే చెప్పటం తెలిసిందే. ఇక.. సర్వే వివరాలు అధికారికంగా బయటకు రాకున్నా.. లీకుల రూపంలో బయటకు వస్తున్నాయి.
తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్సార్‌కాంగ్రెస్ అధినేత.. జగన్ కు సంబంధించిన ర్యాంకు బయటకు వచ్చింది. ఆయనకు మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 131 ర్యాంకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
రాజకీయంగా దెబ్బ తీసే ఏ చిన్న అవకాశాన్ని రాజకీయ పార్టీలు విడిచి పెట్టవు. అలాంటి విపక్ష నేత పని తీరు అద్భుతంగా ఉందంటూ సర్వే ఫలితం ఉంటుందని ఆశించలేం. కానీ.. మరీ.. అన్యాయంగా 175 మంది ఎమ్మెల్యేల్లో జగన్ ర్యాంకు 131గా ఉండటం కాస్తంత చిత్రమే. అంతేకాదు.. 2014 సార్వత్రి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన జగన్ ర్యాంకు మరీ ఇంత పూర్ గా ఉండటం విశేషం.
చూస్తుంటే.. రాజకీయంగా దెబ్బ తీయటానికే జగన్ ర్యాంకు దారుణంగా పడిపోయేలా చేశారన్న విమర్శను విపక్ష నేతలు చేస్తున్నారు. అయినా.. అధికారపక్షం చేయించిన సర్వేలో విపక్ష నేతకు మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించటం అత్యాశే అవుతుందన్న మాటలో ఎంతో కొంత నిజం ఉందనే చెప్పక తప్పదు.