ఏపీలో గత మూడు రోజులుగా అట్టుడికిపోయే పరిణామాలు జరిగాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన పెద్దాయన వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దాంతో ఒక్కసారిగా అలజడి అధికార పార్టీలో రేగింది. దానికి కారణం భాస్కరరెడ్డి జగన్ కి స్వయాన చిన్నాన్న.
ఇక ఇపుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీద సీబీఐ కత్తి వేలాడుతోంది. ఆయనకు ఈ నెల 25వ తేదీ వరకే అరెస్ట్ నుంచి ఉపశమనం కలిగేలా తెలంగాణా హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ మీద తీర్పు ఆ తరువాత ఉంటుంది.
మొత్తానికి ఈ రోజు నుంచి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి వెళ్తున్నారు. ఆయన ఏమి చెబుతారు ఏంటి అన్న ఉత్కంఠ అయితే అంతటా ఉంది. ఇదిలా ఉండగా గత మూడు రోజుల పరిణామాల మీద జగన్ ఎక్కడా నోరు అయితే విప్పలేదు. కానీ ఆయన శ్రీకాకుళం జిల్లా టూర్ లో నౌపడా వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
అవి కూడా పరోక్షంగా చేశారు. దాన్ని జగన్ మార్క్ రియాక్షన్ గా విశ్లేషించుకుంటే మాత్రం సీబీఐ తీరు పట్ల కానీ విపక్షాలు ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుని రాజకీయంగా వాడుకునే విధానాన్ని కానీ జగన్ తప్పు పట్టినట్లుగా కనిపిస్తోంది.
ఒక అబద్దాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయలని విపక్షాలు చూస్తున్నాయని జగన్ అనడంలోని అంతరార్ధం తాజా పరిణామాలే అని అంటున్నారు. వైఎస్ భాస్కరరెడ్డి అరెస్ట్, అవినాష్ సీబీఐ విచారణ క్రమంలో వివేకా హత్య కేసులో వారే అసలైన నిందితులు అంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని జగన్ ఈ విధంగా తిప్పికొట్టారని అంటున్నారు.
అదే క్రమంలో ఆయన ప్రజలకు కూడా దీని మీద చెబుతూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారని అంటున్నారు. విపక్షాలు అన్నీ ఏకమయ్యాయని అబద్ధాలనే వారు ప్రచారం చేయడం ద్వారా తన మీద రాజకీయ దాడిని చేస్తున్నాయని జనాలకు జగన్ చెప్పడంలోని ఉద్దేశ్యం తాము క్లీన్ గా నీట్ గా ఉన్నామని ప్రతిపక్షమే బురద జల్లుతోందని అన్నదే
ఇక జగన్ మాటలలో మరో అర్ధాన్ని చూస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ఈ అరెస్ట్ చేసింది. ఆ మీదట విపక్షాలు వైసీపీని టార్గెట్ చేశాయి. మరి అబధ్దాన్ని పదే పదే నిజం చేయడం అంటే సీబీఐ కూడా ఏకపక్షంగా విచారిస్తోంది అని చెప్పడమేనా అంటే ఆ విధంగానూ అనుకొవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు.
మొత్తానికి వైఎస్ కుటుంబీకులు, పార్టీ కి అతి ముఖ్యులు, ముఖ్యంగా వైసీపీకి కీలక స్థావరం జగన్ సొంత ఇలాకా కంచుకోట అయిన కడపలో అరెస్టులు మాత్రం వైసీపీ అధినాయకత్వాన్ని తీవ్రంగా కలవరపరచాయని ప్రచారం అయితే ఉంది. దానికి ఎంతో కొంత ఊతమిచ్చేలాగానే ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా టూర్ లో చేసిన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇక్కడ ఒక్కటి చూడాలి. అబద్ధాలు నిజాలు అన్నవి రెండూ పక్క పక్కనే ఉంటాయి. ప్రజలు కూడా వాటి తేడాను గ్రహిస్తారు. పదే పదే ఎవరు అసత్యాలు వల్లించినా నమ్మేటంత అమాయకులు ప్రజలు కారు అన్నది ఎప్పటికపుడు నిరూపితం అవుతూనే ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి తన వాదనగా ఆవేదనగా విపక్షాల గురించి చెబుతూ చేసిన విమర్శలలోని లోతులను అంతరార్ధాలను ప్రజలు తప్పకుండా చూస్తారు గ్రహిస్తారు. అయితే వాస్తవాలు అన్నవి ఎవరూ తోసిపుచ్చలేనివి. చెరపలేనివి.
ఎంత తిమ్మిని బమ్మిని చేయాలనుకున్నా అది ఎవరికీ సాధ్యపడకపోవచ్చు. అయితే రాజకీయాల్లో ఎత్తులు వ్యూహాలు ఎన్నో ఉంటాయి పైగా విపక్షాల మీద అధికార పక్షం ఎపుడూ విమర్శలు చేస్తూ తిప్పి కొడుతుంది. విపక్షం సైతం రాజకీయాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయతిస్తుంది. ఈ రాజకీయ చెలగాటం వాస్తవాలను మాత్రమే జనాలు తీసుకుంటారు. వాటిని బట్టే వారి తీర్పులు మార్పులు ఉంటాయన్నది వాస్తవం.