ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆయనను ఓ దండుగుడు విశాఖ ఎయిర్ పోర్టులో చంపడానికి ప్రయత్నించడం.. అది తృటిలో తప్పిపోయి జగన్ భుజానికి గాయమవడం సంచలనం రేపింది. జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
జగన్ పై హత్యాయత్నం చేసిన వార్త తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ అభిమానులు, జనాలు రోడ్ల మీదకు వచ్చి జగన్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వైఎస్ జగన్ ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ట్విట్టర్ లో తాను సురక్షితంగానే ఉన్నానని సెలవిచ్చారు..
వైఎస్ జగన్ ట్వీట్ చేస్తూ ‘నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అందరికీ తాను సురక్షితంగా ఉన్నానని తెలియజేస్తున్నా.. దేవుడు దయ, ప్రజల ప్రేమే నన్ను కాపాడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదమే నన్ను రక్షించింది. ఇలాంటి పిరికిపందల చర్యలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేవు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడాలనే నా సంకల్పానికి ఇవి అడ్డురావు’ అని వివరణ ఇచ్చారు.