సూటి ప్రశ్న. డొంకతిరుగుళ్లు.. అర్థం కాని చిక్కు ప్రశ్నలేమీ లేవు. ఒకే ఒక్క ప్రశ్న. మీ కళ్ల ముందు దారుణం జరిగితే..స్పందిస్తారా? లేదా? ఎవరెట్లా పోయినా నాకెందుకు? అనుకుంటే.. మాట్లాడేదేమీ లేదు. ఈ కథనాన్ని చదవాల్సిన అవసరం కూడా లేదు. అలా కాకుండా..మనిషన్నాక అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉంటారా? దారుణం జరుగుతుంటే.. నిలదీయకుండా ఉంటారా? అని ఫీలయ్యారా? అయితే.. ఈ కథనం కచ్ఛితంగా మీలాంటి వాళ్ల కోసమే.
రాజకీయాల పుణ్యమా అని సత్యం ఎలా సమాధి అవుతుందో చెప్పే సంఘటనగా దీన్నిచెప్పాలి. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. నిజాన్ని నిజంగా చెప్పటానికి.. అన్యాయాన్ని అన్యాయం అని చెప్పటానికి.. మీడియాకు గతంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవికావు. ఇప్పటి మాదిరి మనోడికైతే ఒక న్యాయం.. మనం అభిమానించే రాజకీయ పార్టీకైతే ఒక ధర్మం.. మిగిలిన వారైతే ఇంకో ధర్మం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి కావు. ఒకవేళ అభిమానాలు ఉన్నా.. ఏదైనా సంఘటన జరిగితే.. పూర్తిగా ప్రజల పక్షాన పాత్రికేయం నడిచేది.
దుర్మార్గమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చేసింది. నిన్న కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం గురించే చూస్తే.. అధికారపార్టీకి చెందిన వారికి సంబంధించింది.. వారిని ఇబ్బంది పెట్టే ఉదంతం చోటు చేసుకుంటే.. పోలీసులు.. అధికారులు ఒకలా వ్యవహరించే తీరు చిరాగ్గా అనిపించకమానదు. ఎందుకలా అంటే.. దివాకర్ ట్రావెల్స్ బస్సు అంటే.. ఎవరిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వార్తలు చదివే అలవాటు ఉన్న ఎవరికైనా.. ఆ ట్రావెల్ బస్సులు ఎవరిదో అందరికి తెలిసిందే.
బస్సు యజమాని ఎవరన్న విషయాన్ని పక్కన పెడితే.. ఇంత దారుణ ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? ఈ ప్రమాదంలో డ్రైవర్ బాధ్యత ఎంత? అతను తాగి ఉన్నాడా? లేదా? అన్నవి తెలియాల్సిన అవసరంఉంది. అంతేకాదు.. ఈ బస్సులో మరో డ్రైవర్ ఉండాలి. మరి.. అతడు ఉన్నాడా? అతను తాగి ఉన్నాడా? లేడా? అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీటన్నింటితో పాటు.. డ్రైవర్ల లైసెన్స్ లు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కానీ.. తాజా ప్రమాదంలో జరిగిన పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పాలి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఆదినారాయణ ఘటనాస్థలంలోనే మరణించారు. ఆయన్ను పోస్ట్ మార్టం చేయకుండా తరలించటాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. క్షతగాత్రుల్ని పరామర్శించటానికి ఆసుపత్రికి వెళ్లిన జగన్.. మృతదేహాల్ని ఉంచిన పోస్ట్ మార్టం గదిలోకి వెళ్లి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అందుకు.. అధికారులు ఒప్పకోలేదు. ఈ విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం.
అసలు ప్రమాదం ఎలా జరిగింది? పది నిండు ప్రాణాలు ప్రాణాలు పోవటానికి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావటానికి కారణం ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు తేలాల్సి ఉంది. బాధితులకు ఏ మాత్రం న్యాయం జరగాలంటే.. ఈ ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరి. ఇలాంటి వేళలో ఎవరున్నా ఏం చేస్తారు? తప్పు చేసిన వారెవరన్నది గుర్తించటంతో పాటు.. నిందితుల్ని గుర్తించేందుకు అవకాశం ఉన్న సాక్ష్యాల్ని భద్రంగా ఉండేలా చూడటం తప్పనిసరి.
సరిగ్గా అదే పనిని చేశారు ఏపీ విపక్ష నేత జగన్ కూడా. పోస్ట్ మార్టం గది వద్ద బస్సు డ్రైవర్ కు పోస్ట్ మార్టం చేశారా? అని ప్రశ్నించారు. అక్కడున్న పత్రాల్ని చూస్తే.. పోస్ట్ మార్టం చేయకుండా డ్రైవర్ ను.. మరికొందరిని ప్యాక్ చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాల దగ్గర రాజకీయం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ.. ఆ ప్రశ్నలు శవ రాజకీయం కోసం కాదు.. ప్రాణాలు పోయిన వారికి న్యాయం చేయాలంటే ఆ ప్రశ్నలు తప్పనిసరి.
ఎందుకంటే.. బస్సుడ్రైవర్ ను పోస్ట్ మార్టం చేయకుండా అతని స్వస్థలానికి పంపిస్తే.. బస్సు ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది బయటకు రాదు. ఒకవేళ డ్రైవర్ కానీ తాగి బస్సు నడిపితే.. అందుకు బాధ్యత అతనిది.. ఆ బస్సు యాజమాన్యానిది అవుతుంది. ఒకవేళ అలాంటి విషయాలు బయటకు వస్తే.. బస్సు యజమాని అయిన అధికారపక్ష నేతకు ఇబ్బందిగా మారుతుంది. అందుకే.. హడావుడిగా ఎలాంటి శవపరీక్ష జరపకుండా మృతదేహాల్ని తరలిస్తున్నారన్నది విమ్శకుల మాట.
అందుకే.. విపక్ష నేత రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే.. శవ పరీక్ష జరకుంటే.. బాధితులకు న్యాయం జరగదు. అందుకే.. పోస్ట్ మార్టం చేయకుండా బస్సు డ్రైవర్ మృతదేహాన్ని తరలిస్తున్నట్లుగా ఉన్న పత్రాల్ని తిరిగి ఇచ్చేందుకు జగన్ ఇష్టపడలేదు. కానీ.. ఇది జిల్లా కలెక్టర్ కు అస్సలు నచ్చలేదు. అదే ఇరువురి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
నిజాల్ని వెలుగులోకి తెచ్చేందుకు.. బాధితులకు సాయం చేయటానికి.. అండగా నిలవటానికి విపక్ష నేత ప్రయత్నిస్తే.. తప్పును కప్పిపుచ్చటానికిఅన్నట్లుగా.. నిబంధనలకు విరుద్ధంగా.. శవపరీక్షలు చేయకుండా బస్సు డ్రైవర్ తో సహా కొందరి మృతదేహాల్ని ఎందుకు తరలిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పని అధికారులు.. వాదనను పెంచేలా..జగన్ ను రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందుకు తగ్గట్లే.. విపక్ష నేత శవరాజకీయం చేస్తున్నారని.. మృతదేహాల దగ్గర పోస్ట్ మార్టం రిపోర్టులు ఇవ్వకుండా హడావుడి చేశారన్న మాటల్ని మాత్రమే చెబుతున్న అధికారపక్ష నేతలు.. వారికి సంబంధించి అనుకూల మీడియా.. ఎక్కడా కూడా బస్సు డ్రైవర్ ను పోస్ట్ మార్టం చేయకుండా తరలించే ప్రయత్నం చేశారన్న మాటను మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం. ఇదంతా చూసిన తర్వాత.. కళ్ల ముందు జరుగుతున్న తప్పును.. అన్యాయాన్ని నిలదీసే ప్రయత్నం చేసిన జగన్ తప్పుడోడా..? అధికారుల అలసత్వాన్ని ప్రశ్నించటం ఘోరమైన అన్యాయమా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/