జ‌గ‌న్ బాబు ఢిల్లీలో ధ‌ర్నా చేస్తారంట‌

Update: 2015-07-27 12:24 GMT
ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల కోసం తాను ఏ మాత్రం స్పందించ‌టం లేద‌ని..పోరాటాలు చేయ‌టం లేద‌న్న భారీ విమ‌ర్శ‌లు ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ దృష్టికి వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.
ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి గ‌ట్టిగా నాలుగు ముక్క‌లు మాట్లాడ‌ని ఆయ‌న‌.. తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య ఒక‌టి చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ.. పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేలు.. ఏడుగురు ఎంపీల‌తోక‌లిసి ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో.. ఏపీకి నాటి కేంద్రం ఇచ్చిన హామీల అమ‌లు గురించి విప‌క్ష నేత ఏమీ మాట్లాడ‌టం లేద‌న్న విమర్శ‌లు రోజురోజుకీ పెరిగిపోతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం తానిప్ప‌టికే ఎన్నో పోరాటాలు చేసిన‌ట్లుగా చెప్పుకొచ్చారు. ప్ర‌త్యేక హోదా కోసం మంగ‌ళ‌గిరిలో ధ‌ర్నా నిర్వ‌హించిన‌ట్లుగా చెప్పుకున్న ఆయ‌న‌.. కేంద్రం.. చంద్ర‌బాబు క‌ళ్లు తెరిపించేంత వ‌ర‌కూ ఉద్య‌మం చేస్తాన‌ని చెప్పుకున్నారు.

ఎవ‌రి క‌ళ్లు తెరిపిస్తారో త‌ర్వాత సంగ‌తి.. మొద‌ట అయితే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌చ్చేలా పోరాడాల‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌త్యేక హోదా కోసం ఢిల్లీలో జ‌గ‌న్‌బాబు ఏ రేంజ్ లో పోరాటం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News