నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి గట్టిగా పక్షం రోజులు కాకుండానే జగన్ తనదైన శైలిలో రాణిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్న జగన్... ఇప్పటికే రాష్ట్రానికి బాసటగా - నిలిచే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి స్పందనను రాబట్టగలిగారు. అదే స్పీడును కొనసాగిస్తున్న జగన్... చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించిన నిధులను కూడా రాబట్టే పనిని మొదలెట్టేశారు. ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చేసిన కేంద్రం... ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును భరిస్తానని ప్రకటించింది. అంతేకాకుండా తామే ప్రాజెక్టును నిర్మించి ఇస్తామని కూడా చెప్పింది. అయితే చంద్రబాబు సర్కారు మాత్రం నిధులిస్తే తామే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడతామని కొత్త ప్రతిపాదన చేసి ప్రాజెక్టు పనులను తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి విడుదలైన నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను చంద్రబాబు సర్కారు సమర్పించని కారణంగా నిధుల విడుదలపై మోదీ సర్కారు అంతగా స్పందించడం లేదు. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించే క్రమంలో చంద్రబాబు సర్కారు... రాష్ట్ర ఖజానా నుంచి రూ.5 వేల కోట్లను వెచ్చించింది. ఈ నిధులను విడుదల చేయాలంటూ చంద్రబాబు సర్కారు ఎన్ని సార్లు విన్నవించినా మోదీ పట్టించుకోలేదు.
అయితే తాను సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... ఈ నిధులను రాబట్టే విషయంలో జగన్ చాలా వేగంగానే స్పందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లను తక్షణమే విడుదల చేయాలంటూ జగన్ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖను అందుకున్న కేంద్ర జలవనరుల శాఖ కూడా సానుకూలంగానే స్పందిస్తూ ఆ నిధుల విడుదలకు అనుమతించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే... ఈ నిధులు రాష్ట్రానికి విడుదల కానున్నాయి. అంటే... పోలవరం కోసం చంద్రబాబు సర్కారు ఖర్చు చేసిన రూ.5 వేల కోట్లను జగన్ అధికారం చేపట్టిన వెంటనే కేంద్రం నుంచి రాబడుతున్నారన్న మాట.