రాజధాని పై మరోసారి సీఎం స్పందన - స్పష్టత వచ్చినట్టే!
ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనను ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రకటనకు కట్టుబడి ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఈ అంశంపై ఏలూరులో జగన్ మాట్లాడారు. ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం గురించి పరోక్షంగా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఒక ప్రాంతానికే న్యాయం జరిగిందని, కొందరికే న్యాయం జరిగిందని జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం పాత తప్పులను సరిదిద్దుతుందని..అందరికీ న్యాయం చేస్తుందని జగన్ ప్రకటించారు.
మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తామంటూ జగన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ విబేధాలు తలెత్తకుండా, మూడు ప్రాంతాలకూ న్యాయం చేసేలా.. ఎప్పటికీ కలిసి ఉండేలా తమ నిర్ణయం ఉంటుందని జగన్ ప్రకటించారు.మూడు ప్రాంతాల ప్రజలూ అన్నదమ్ముల్లా కలిసి ఉండేలా నిర్ణయాలు ఉంటాయని జగన్ తెలిపారు. ఆ మేరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని అన్నారు.
ఈ ప్రకటనతో మూడు రాజధానుల అంశంలో జగన్ మోహన్ రెడ్డి ఏమీ తగ్గలేదని స్పష్టం అవుతోంది. ఒకవైపు అమరావతి ఆందోళనలు సాగుతున్నాయి. వాటిల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు, ఆయన భార్య కూడా పాల్గొని పోరాటానికి విరాళం అంటూ తన ప్లాటినం గాజును ఆమె ఇచ్చారు. ఇలా తెలుగుదేశం పార్టీ వాళ్లు అమరావతి మాత్రమే అంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం తమ నిర్ణయంలో ఏ మాత్రం మార్పు లేదనే స్పష్టతను ఇచ్చారు. ఇక అధికారిక ప్రకటనలు రావడమే తరువాయి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.