వ‌ర్మ బెజ‌వాడ ఎపిసోడ్ పై జ‌గ‌న్ రియాక్ష‌న్!

Update: 2019-04-29 05:16 GMT
సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకొని తాను చేసే వ్యాఖ్య‌ల‌తో సెగ‌లు.. పొగ‌లు పుట్టించే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌.. తాజాగా బెజ‌వాడ‌కు వెళ్లిన వైనం తెలిసిందే. తాను తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుద‌ల‌పై ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళుతున్న‌ట్లుగా ట్వీట్లు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. చిత్ర నిర్మాత‌తో క‌లిసి.. త‌మ సినిమాపై ఏపీ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరును త‌ప్పు ప‌డుతున్న ఆయ‌న‌.. మీడియా మీట్ ను ఏర్పాటు చేశారు.

అయితే.. వ‌ర్మ ప్రెస్ మీట్ లేనిపోని ఉద్రిక్త‌త‌ల‌కు అవకాశం ఇస్తుంద‌న్న పేరుతో ఏపీ పోలీసులు ఆయ‌న్ను ప్రెస్ మీట్ ను పెట్ట‌కుండా ఆడ్డుకున్నారు. గంట‌ల త‌ర‌బ‌డి సాగిన హై డ్రామా అనంత‌రం.. ఆయ‌న్ను హైద‌రాబాద్ విమానం ఎక్కించేశారు. ఏపీ పోలీసులు అనుస‌రించిన తీరుపై రాంగోపాల్ వ‌ర్మ త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా.. ఈ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసిన ఆయ‌న‌.. ఏపీ స‌ర్కారు తీరును త‌ప్పు ప‌ట్టారు. విజ‌య‌వాడ‌లో ప్రెస్ మీట్ పెట్ట‌లేని ప‌రిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు క‌న్నా హీనంగా వాడుకునే ప‌రిస్థితుల్లో మ‌న ప్ర‌జాస్వామ్యం ఉంది. ఇదా ప్ర‌జాస్వామ్యం?  చంద్ర‌బాబుగారూ.. ఇంత‌కీ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన త‌ప్పేంటి? అంటూ స్పందించారు.
Tags:    

Similar News