ఏపీ విపక్ష నేత జగన్ కోపంతో ఊగిపోయారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో చోటు చేసుకున్న తీవ్ర తొక్కిసలాటలో 27 మంది మరణించటం.. పెద్ద ఎత్తున భక్తులు గాయపడిన అంశంపై ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతమంది చావుకు కారణమైన చంద్రబాబును జైల్లో పెట్టాలని వ్యాఖ్యానించారు.
తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను ఆసుపత్రిలో పరామర్శించిన జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. వీఐపీ ఘాట్ లో పూజలు చేసుకోకుండా.. పబ్లిసిటీ కోసం సాధారణ భక్తుల ఘాట్‌కు వెళ్లి హడావుడి చేశారని.. బాబు రాక కారణంగా..రెండున్నర గంటల పాటు భక్తుల్ని ఆపటం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు.
జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబును డిమాండ్ చేసిన జగన్.. జరిగిన దానికి చంద్రబాబు కాశీకి వెళ్లి తన పాపాల్ని ప్రక్షాళన చేసుకోవాలని సూచించారు. మరోవైపు.. జరిగిన తప్పునకు చంద్రబాబును జైల్లో పెట్టాలంటూ డిమాండ్ కూడా ఇదే జగన్ చేయటం గమనార్హం.