కష్టంలో ఉన్న వారిని కలవటం.. వారికి బతుకు మీద సరికొత్త భరోసా ఇవ్వటం.. వారిలో ధైర్యాన్ని నింపటం లాంటివి రాజకీయ నేతలు తరచూ చేస్తుంటారు. అయితే.. అలాంటి వాటిని రాజకీయం చేసి.. నెలల తరబడి ఒక కార్యక్రమంలా నడిపించే నేత ఎవరైనా ఉన్నారా? అంటే అది ఏపీ విపక్ష నేత.. వైస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. తన తండ్రి.. దివంగతమహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాల మృతితో షాక్ తిని.. పలువురు ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. పెద్ద ఎత్తున జరిగిన ఈ ప్రాణ నష్టానికి కదిలిపోయి.. ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రంలోని వివిద జిల్లాల్ని పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
గడిచిన ఆరేళ్లకు పైనే సాగుతున్న ఓదార్పు యాత్ర.. సమీప భవిష్యత్తులో పూర్తి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. తమకు తీరిక ఉన్నప్పుడల్లా ప్రజల మధ్యకు వచ్చి ఓదార్పు యాత్రతో జగన్ ఫ్యామిలీ చేసే రాజకీయం చేస్తే నోట మాట రాని పరిస్థితి. ఇంటిపెద్ద కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నవారు.. కోలుకొని కొత్త జీవితం దిశగా అడుగులు పడుతున్న వేళ.. హంగుఆర్భాటంతో వారి ఇళ్లకు వెళ్లి.. అంతులేని శోకాన్ని గుర్తుకు తెచ్చే వైనం చూస్తే.. రాజకీయంగా కోసం మరీ ఇంత ఇదిగా వ్యవహరించాలా? అన్న సందేహం కలగక మానదు.
ఏదైనా కష్టం వచ్చిన వెంటనే.. స్పందించి వారిని కలిసి సాయం అందించటం ఒక పద్ధతి. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినప్పుడల్లా.. ఏపీ అధికారపక్షం ఏదైనా కార్యక్రమం చేపట్టిన సమయంలోనో..ఓదార్పు తరహా పర్యటనల్ని చేపట్టటం గమనార్హం. తాజాగా జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు చేపడితే.. దానికి కౌంటర్ గా విపక్ష నేత జగన్.. ఆత్మహత్య చేసుకున్న రైతు - చేనేత కార్మికుల కుటుంబాల్ని పరామర్శించే కార్యక్రమాన్ని షురూ చేశారు.
బుధవారం అనంతపురం జిల్లాలో ఈ పరామర్శ యాత్రను చేపట్టిన జగన్.. మొదటి రోజు మొత్తంగా 3 కుటుంబాల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా నిలుస్తానంటూ ధీమా ఇచ్చారు. ఆయా కుటుంబాల పిల్లలకు విద్యా సాయం అందిస్తానని మాట ఇచ్చారు. వారు ఎదుర్కంటున్న పరిస్థితుల్ని చూసి తల్లడిల్లిపోయిన జగన్ కంట కన్నీరు ఉబికి వచ్చేసింది. మరింత కష్టాలు పడుతున్న మరింత మందిని కలుసుకోవాల్సింద పోయి.. ముగ్గురుతొ సరిపెట్టిన వైనం కాస్తంత విస్మయానికి గురి చేస్తుంది. మొదటి రోజు మూడు కుటుంబాల్ని పరామర్శించిన జగన్ బాబు.. ఈ రోజు (గురువారం) మాత్రం ఏడు కుటుంబాల్ని పరామర్శించనున్నట్లు చెబుతున్నారు. పరామర్శ కంటే రాజకీయం ఎక్కువైన నేపథ్యంలో.. బాధితుల గోడు జగన్ బాబుకు పడుతుందా..?