కొత్త జిల్లాలకు పేర్లు డిసైడ్ చేసిన జగన్ సర్కార్

Update: 2022-01-26 04:55 GMT
తాము అధికారంలోకి వస్తే ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తానని వైసీపీ అధినేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసినా.. అనుకోని అవాంతరాలతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. కొద్ది రోజులుగా కొత్త జిల్లాలకు సంబంధించిన కసరత్తు వేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆన్ లైన్ లో ఆమోదం తెలిపింది.

ఇప్పుడున్న 13 జిల్లాల స్థానే 26 జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను సిద్ధం చేయటమే కాదు.. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రోజు (బుధవారం) విడుదల చేయటానికి సిద్దమవుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటును వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. అరకు నియోజకవర్గం విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో దాన్ని రెండు జిల్లాలుగా చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది.

కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకోవటానికి మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆన్ లైన్ లో మంత్రి వర్గం ముందు ఉంచారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను తెర మీదకు తీసుకురాగా.. సభ్యులంతా ఆన్ లైన్ లో ఆమోద ముద్ర వేసినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్త జిల్లాలు.. వాటికి పెట్టే పేర్లు ఏమి ఉండనున్నాయి? అన్న విషయంలోకి వెళితే..

జిల్లా పేరు                                         జిల్లా కేంద్రం

శ్రీకాకుళం                                          శ్రీకాకుళం
విజయనగరం                                   విజయనగరం
మన్యం జిల్లా                                    పార్వతిపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా             పాడేరు
విశాఖపట్నం                                   విశాఖపట్నం
అనకాపల్లి                                       అనకాపల్లి
తూర్పుగోదావరి                             కాకినాడ
కోనసీమ                                        అమలాపురం
రాజమహేంద్రవరం                         రాజమహేంద్రవరం
నరసాపురం                                  భీమవరం
పశ్చిమగోదావరి                           ఏలూరు
క్రష్ణా                                           మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా                             విజయవాడ
గుంటూరు                                 గుంటూరు
బాపట్ల                                     బాపట్ల
పల్నాడు                                 నరసరావుపేట
ప్రకాశం                                     ఒంగోలు
ఎస్పీఎస్ నెల్లూరు                    నెల్లూరు
కర్నూలు                                 కర్నూలు
నంద్యాల                                  నంద్యాల
అనంతపురం                            అనంతపురం
శ్రీ సత్యాసాయి జిల్లా                   పుట్టపర్తి
వైఎస్సార్ కడప                        కడప
అన్నమయ్య జిల్లా                  రాయచోటి
చిత్తూరు                                చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా                       తిరుపతి
Tags:    

Similar News