టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు - ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు వెల్లువలా వినిపిస్తున్నాయి. గడచిన ఎన్నికల నాటి నుంచి మొన్నటిదాకా దాదాపు నాలుగేళ్ల పాటు చంద్రబాబు కలిసి నడిచిన బీజేపీకి చెందిన కీలక నేతలు చంద్రబాబు పాలనలోని అవినీతితో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు - నేతలు బహిరంగంగానే అవినీతకి పాల్పడుతున్నా... చంద్రబాబు కిమ్మనకుండా ఉండిపోతున్నారని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నేరుగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ... సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతీ తెలిసిందే. లంచం తీసుకుంటే... రషీదులేమైనా ఇస్తారా? అన్న కోణంలో లోకేశ్ అవినీతికి పాల్పడిన మాట ముమ్మాటికీ వాస్తవమేనని కూడా పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ రెండు వర్గాలు కూడా గడచిన ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం అందడానికి కీలక భూమిక పోషించినవే. అంతేకాకుండా మొన్నటిదాకా కూడా ఈ రెండు వర్గాలు చంద్రబాబు వెంట నడిచినవే.
అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అధినేత - విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇతే తరహా ఆరోపణలు చంద్రబాబుపై ఆది నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే జగన్ చేస్తున్న ఆరోపణలను నాడు కొట్టిపారేసిన నేతలే... ఇప్పుడు అవే మాటలు నిజమన్న రీతిలో కామెంట్లు చేస్తుండటమే గమనార్హం. ఈ క్రమంలో తనదైన శైలిలో చంద్రబాబు అవినీతిపై తూటాలు పేలుస్తున్న జగన్... తాజాగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో మరోమారు చంద్రబాబు అవినీతిపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు స్వయంగా అవినీతిలో భాగస్వామిగా ఉన్నారని జగన్ ఆరోపించారు. ఎమ్మెల్యేల నుంచి కలెక్టర్ల వరకు, ఆపై చివరకు పెదబాబుకు సైతం వాటాలు ఉండటం బహిరంగ రహస్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో పచ్చ చొక్కాలు తప్పించి సాధారణ ప్రజానీకం ఎవరూ సంతోషంగా లేరన్నారు. తిరిగి ఎన్నికలు రానున్నందున గతంలో ఇచ్చిన తప్పుడు హామీల మాదిరిగానే ఈసారి మరిన్ని ప్రకటిస్తారని, వాటిని ఎవరూ నమ్మరన్నారు. ప్రతి ఇంటికి ఒక కిలో బంగారం, బెంజ్ కారు కూడా ఇస్తానని చంద్రబాబు చెబుతారని జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కొందరు మనుషులు వచ్చి రూ.మూడు వేలు చేతిలో పెడతారన్నారు. అయితే వారి నుంచి రూ.ఐదు వేలు డిమాండ్ చేయాలన్నారు. అదంతా మన డబ్బేనని, దోచుకుని తిరిగి మనకే ఇస్తున్నారని గ్రహించాలన్నారు. ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయాలన్నారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని టీడీపీ నెరవేర్చలేదన్నారు. పవన్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తారని, పవన్ సినిమా తక్కువ, ఇంటర్వెల్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. సీఎంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని గట్టిగా పట్టుపట్టి ప్రధాని మోడీని చంద్రబాబు డిమాండ్ చేసి ఉంటే కచ్చితంగా వచ్చేదని, కానీ ఏపీ సీఎం చంద్రబాబు స్వలాభం కోసం ఏనాడూ అలాంటి ప్రయత్నం చేయలేదని జగన్ ఆరోపించారు. అందిన కాడికి దోచుకోవటం, ప్రజలను మోసం చేయటం, నమ్మిన వారిని మోసం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలని నిప్పులు చెరిగారు. ఈ నాలుగేళ్ల పాలన ఇలాగే సాగిందన్నారు. ఆయన గుంటూరు జిల్లా పాదయాత్రలో మాట్లాడారు. హెదా డిమాండును టీడీపీ అన్ని రకాలుగా నీరుగార్చిందన్నారు. హోదా కోసం అంటూ ఇప్పుడు చంద్రబాబు సైకిల్ యాత్రలు చేస్తున్నారని, ఆయన అసలు మనిషేనా అనే సందేహం కూడా వస్తోందని జగన్ అన్నారు. లంచం ఇవ్వనిదే రాష్ట్రంలో పని జరగడం లేదన్నారు. స్వయానా సీఎం ఇంటి చుట్టూ ఇసుకను దోపిడీ చేస్తున్నారని, కృష్ణా నది గర్భాన్ని తొలిచే పనిని ఆధునిక యంత్రాలతో సాగిస్తున్నారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలే చేశారు. మరి ఈ కామెంట్లపై టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో చూడాలి.