ఆ సీఎం అపాయింట్ మెంట్ కోరిన సీఎం జగన్

Update: 2021-04-18 00:30 GMT
పక్క రాష్ట్రాలతో సయోధ్య కోసం ఏపీ సీఎం జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు మాంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు పోలవరం, వంశధార ప్రాజెక్టుకు అడ్డుపడుతున్న ఒడిశాతోనూ సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు.

తొలిసారి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అపాయింట్ మెంట్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యపై మాట్లాడుకుందామంటూ ప్రతిపాదించారు.ఏపీ, ఒడిశా మధ్య వంశధార నదిపై నిర్మించతలపెట్టిన  నేరడి బ్యారేజీ అంశంపై చర్చించేందుకు సీఎం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అపాయింట్ మెంట్ కోరారు.

ఒడిశాలోని కలహందిలో పుట్టే వంశధార నది అక్కడి నుంచి మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశిస్తోంది.  దీంతో వంశధార నదికి సంబంధించి ఏపీ , ఒడిశా మధ్య వివాదాలు ఉన్నాయి.ఇందులో శ్రీకాకుళం జిల్లాలో నిర్మించే వందకోట్లతో నిర్మించాల్సిన నేరడి బ్యారేజీ కీలకమైనది . ఈ వివాదాలు అపరిష్కృతంగా ఉన్నందున బ్యారేజీ పులు కూడా నిలిచిపోయాయి. దీనికోసమే ఏపీ సీఎం జగన్ ఒడిశా సీఎంతో మాట్లాడనున్నారు.
Tags:    

Similar News