దోపిడీ..లంచాలు - దౌర్జన్యం ఎలా చేయాలో టీడీపీ ఎమ్మెల్యేలు - ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చారని, ఆయనే వారందరికీ మాస్టర్ ట్రైనర్ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వద్దకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఆయన అవినీతి కారణం పొలవరం పనులు మందకోడిగా సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 167వ రోజు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు.నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో పోలవరం కట్టలేదు. కనీసం మిగిలిపోయిన పిల్ల కాల్వలైనా కట్టారా? అని ప్రశ్నించారు. పోలవరానికి ప్రతి సోమవారం చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారు. ఆయన వెళ్లేది పనులు చేయించేందుకు కాదు..కమీషన్ల కోసమే వెళ్తున్నారు అని జగన్ ఆరోపించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని రాజకీయాలపై ఈ సందర్భంగా జగన్ విరుచుకుపడ్డారు. `ఈ జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలకు - ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చక్కని ట్రైనింగ్ ఇచ్చారు. రౌడీయిజం చేయడంలో ట్రైనింగ్ ఇచ్చారు.. అధికారులపై దౌర్జన్యం చేయడంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఆడవాళ్లను జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లే విషయంలో..ఇసుకను ఎలా దోచుకోవాలో ట్రైనింగ్ ఇచ్చారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు ఎలా లాక్కోవాలో చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా అద్భుతంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన ట్రైనింగ్ పుణ్యమా అని పై స్థాయి వారు దేన్ని వదిలిపెట్టరు. మట్టి-ఇసుక-మద్యం- బొగ్గు కొనుగోలు-రాజధాని భూములు-చివరకు గుడి భూములు- తిరుపతి ఆలయంలో ఆభరణాలు కూడా వదిలిపెట్టడం లేదు. కింది స్థాయిలో ఉన్న జన్మభూమి కమిటీలకు పథకాలలో దండుకోవాలని చెప్పారు. రేషన్ కార్డు కావాలన్నా లంచాలే..చివరకు మరుగు దొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. అంత గొప్పగా చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చారు`` అంటూ జగన్ ఎత్తి పొడిచారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం కేంద్రం నుంచి తీసుకొని రేట్లను విఫరీతంగా పెంచుకుంటూ పోతున్నారని జగన్ ఆరోపించారు. ``చంద్రబాబు వచ్చిన మూడేళ్లలో అల్యూమినియం - సిమెంట్ - ఇసుక - ఐరన్ రేట్లు తగ్గాయి. నామినేషన్ పద్దతిలో చంద్రబాబు తన బినామీలను కాంట్రాక్టర్లుగా తీసుకువచ్చారు. యనమల రామకృష్ణుడు బంధువు పోలవరంలో కాంట్రాక్టర్ గా ఉన్నారు. చంద్రబాబు అవినీతి కారణంగా పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగేళ్లలో కేవలం 6 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు కూడా జరగలేదు. పక్కన కాలేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 6 వేల క్యూబిక్‌మీటర్ల పనులు జరుగుతుంటే పోలవరంలో కేవలం 3 వేల క్యూబిక్ మీటర్లు కూడా జరగడం లేదు.`` అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదని - ఎన్నికల హామీలను నిలుపుకోవడం లేదని జగన్ పేర్కొన్నారు. తెలుగుదేశం వెబ్ సైట్ లో మేనిఫెస్టో కోసం క్లిక్ చేస్తే అక్కడ ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన జాబితా ఏమి కనిపించిందని జగన్ అన్నారు. ఎందుకంటే.. ఎన్నికల ప్రణాళిక కనిపిస్తే ఆయన మోసాలు బయటపడి జనం కొడతారని చంద్రబాబుకు భయం అని అన్నారు. `నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మీ అందరికి ఎలాంటి నాయకుడు కావాలో గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. మోసాలు చేసేవాడు మీకు నాయకుడు కావాలా? అబద్ధాలు చెప్పేవారు మీకు నాయకుడు కావాలా? ఆలోచన చేయండి.` అని జగన్ కోరారు.