ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అవినీతి పరుడని - పదవి కోసం ఎలాంటి అబద్దాలైనా ఆడతారని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. "చంద్రబాబు నాయుడు అవినీతికి పరాకాష్ట " అని జగన్ స్పష్టం చేశారు. జగన్ చేస్తున్న పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను ఓ తెలుగు ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీతో జతకట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతిలో అనకొండలా మారారని విమర్శించారు.
ప్రత్యేక హోదపై నాలుగేళ్లు ఊరకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ అంశంపై ఉద్యమం చేయడం ఏమిటని ప్రశ్నించారు. " భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్లు కాపురం చేసి ఆయన ఏం సాధించారు. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలంటూ ఏకంగా అశంబ్లీలో తీర్మానం చేసారు. ఆ ప్రతిని కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసింది." అని జగన్ స్పష్టం చేసారు.
రాజధాని విషయంలో నాలుగేళైన ఇప్పటి వరకూ ఒక్క ఇటుకైన పడలేదు అని " రాజధాని భూములలో తెలుగుదేశం ఎంఎల్ ఎల పశువులు - బర్రెలూ మేస్తున్నాయి. ఇదీ రాష‌్ట్రంలో అభివ్రుద్ధి" అని జగన్ దుయ్యబట్టారు. పాదయాత్రల సంధర్భంగా తనను కలసిన స్రతి ఒక్కరు చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని జగన్ చెప్పారు. రుణమాఫీ సహా ప్రతి పథకంలోను అవినీతి రాజ్యమేలుతోందన్నారు. గత ఎన్నికలలో తమ పార్టీకి - బిజేపి - తెలుగుదేశం - జనసేన కూటమికి ఓట్ల వ్యత్యాసం కేవలం 5 లక్షల ఓట్లేనని ఆయన గుర్తు చేసారు. " చంద్రబాబు సైకిల్ కి ఒక చక్రం బిజేపి అయితే మరో చక్రం పవన్ కల్యాణ్. ఈ రెండు చక్రాలతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది." అని జగన్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ముఖ‌్యమంత్రి అయితే రాష్ట్రంలో అవినీతి లేకుండా చేస్తానని చెప్పారు. పాదయాత్రలో జగన్ కు రాజకీయ పరిణితి రావడమే కాకుండా ప్రజల కష్టాల పట్ల ఓ అవగాహన వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.